కరోనా: ఆహారం, వైద్యానికే సరిపోతుంది.. ఇంకెక్కడ స్మార్ట్ ఫోన్లు కొంటాం..

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (09:13 IST)
కరోనా వైరస్ కారణంగా.. స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పడిపోయాయి. ప్రపంచంలోనే రెండు అతిపెద్దస్మార్ట్ ఫోన్‌ మార్కెట్లు చైనా, ఇండియా. రెండుదేశాల్లో 260 కోట్లమందికి పైగా జనాభా వుంది. ఏమోడల్ డిజైన్ చేసినా రెండు దేశాల్లోని అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళుతుంటాయి కంపెనీలు.
 
అలాంటి ఈ భారీ మార్కెట్లో అమ్మకాల తగ్గుదల భారీగా కనిపిస్తోందని తాజాగా ఓ సర్వేలో తేలింది. గత సంవత్సరం రెండో క్వార్టర్ అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 20.4 శాతం తగ్గాయి. చైనాలో అమ్మకాలు ఏడు శాతం, ఇండియాలో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 46 శాతం తగ్గినట్లుగా ఆ సర్వే తెలిపింది. ఉన్నంతలో అమ్మకాల పరంగా మొదటి స్థానంలో శామ్‌సంగ్ నిలవగా తదుపరి స్థానాల్లో హువావే, ఆపిల్‌, షావోమీ, ఒప్పోలు ఉన్నాయి.
 
అయితే చైనాలో పరిస్థితులు చక్కబడుతున్నకొద్దీ డిమాండ్ రికవరీ అవుతోందని తెలుస్తోంది. ప్రయాణాలపై ఆంక్షలు పెట్టడం, అత్యవసరం కాని వస్తువుల కొనుగోళ్లు తగ్గడంతో స్మార్ట్ ఫోన్ల సేల్స్‌ పడిపోయాయని వివరించారు. 
 
జనం ఆహారం, పోషకాహారం, వైద్యం వంటి అత్యవసరమయిన వాటికే ఎక్కువగా ఖర్చులు చేస్తున్నారు. చైనా వస్తువులపై భారత్ నిషేధం విధించడంతో చైనా స్మార్ట్ ఫోన్ మార్కెట్లో వివిధ స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌ల అమ్మకాలు తగ్గాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments