Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో వినూత్న ఫీచర్లు .. ఏంటవి? (video)

Webdunia
గురువారం, 2 జులై 2020 (17:59 IST)
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో వినూత్న ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్‌ యాప్‌లో ఇప్పటికే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ను లాంచ్‌ చేసిన వాట్సాప్‌ తాజాగా వాట్సాప్‌ వెబ్‌, డెస్క్‌టాప్‌ యాప్‌ల కోసం డార్క్‌ థీమ్‌ ఫీచర్‌ను బుధవారం విడుదల చేసింది. 
 
నూతన ఫీచర్లను పొందడానికి థర్డ్‌ పార్టీ యాప్‌ల అవసరంలేదని, ప్రస్తుతమున్న యాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా డార్క్‌ మోడ్‌ను పొందవచ్చని కంపెనీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
వాట్సాప్‌ వెబ్‌లో డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ కోసం యూజర్లు గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి లేటెస్ట్‌ వర్షన్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుందని తెలిపింది. 
 
కాగా, ప్రస్తుతం వాట్సాప్‌ను ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మందికి పైగా వినియోగిస్తున్నారు. యూజర్లకు ఆకట్టుకునేందుకు డార్క్‌ థీమ్‌తో పాటు యానిమేటెడ్‌ స్టిక్కర్లు, క్యూఆర్‌ కోడ్స్‌ తదితర నూతన ఫీచర్లను ఆవిష్కరించింది. 
 
వినియోగదారులు ఇప్పుడు తమ క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా కొత్త కాంటాక్టులను కూడా యాడ్‌ చేసుకునే ఆప్షన్‌ ఉంది.  అందరికీ అర్థమయ్యేలా భావ వ్యక్తీకరణకు స్టిక్కర్లు ఉపయోగపడనున్నాయి. గ్రూప్‌ వీడియో కాల్‌లో ఉన్నప్పుడు మనకు నచ్చిన వ్యక్తిపై నొక్కితే ఆ వీడియో మరింత స్పష్టంగా కనిపించేలా  మార్పులు  చేసింది. 
 
ఇకపోతే, 'వాట్సాప్‌లో యూజర్లు ఛాటింగ్‌ చేసే సమయంలో భావ వ్యక్తీకరణకు స్టిక్కర్ల వినియోగం పెరుగుతున్నది. ప్రతిరోజూ కోట్లాది మంది వీటిని ఇతరులకు పంపిస్తున్నారు. ప్రస్తుతం మేం తీసుకొచ్చిన యానిమేటెడ్‌ స్టిక్కర్లు యూజర్లకు మరింత ఫన్‌ను అందిస్తాయని' వాట్సాప్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

దక్షిణాదిలో సమంత రీ ఎంట్రీ గ్రాండ్‌గా వుండబోతోంది.. చెర్రీ, పుష్పలతో మళ్లీ రొమాన్స్!?

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments