Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

'ఏ' పాత్రలో ఈషా రెబ్బా? - వెబ్ సిరీస్‌పై దృష్టిపెట్టిన భామ! (Video)

Advertiesment
Eesha Rebba
ఇటీవలి కాలంలో వెబ్ సిరీస్‌లు పెరిగిపోయాయి. ముఖ్యంగా, కరోనా వైరస్ దెబ్బకు భారతీయ సినీ ఇండస్ట్రీ కుదేలైంది. అదేసమయంలో వెబ్ సిరీస్‌లకు మంచి డిమాండ్ ఏర్పడింది. పైగా, ఓటీటీ మాధ్య‌మానికి ఆద‌ర‌ణ పెరిగింది. దీంతో వెబ్ సిరీస్‌లు విరివిగా వ‌స్తున్నాయి. వీటిల్లో ఎక్కువగా బోల్డ్ కంటెంట్ ఉంటుంది. 
 
అలాంటి బోల్డ్ కంటెంట్‌తో హిందీలో రూపొందిన ఓ వెబ్ సిరీస్ ల‌స్ట్ స్టోరీస్. ఇందులో బాలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ తార‌లంద‌రూ న‌టించారు. అందులో కియారా అద్వానీ కూడా ఓ భాగంలో న‌టించింది. ఆమె చేసిన ఆ బోల్డ్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపునే ఇచ్చింది. 
 
ఇప్పుడు అలాంటి ఓ బోల్డ్ పాత్ర‌లో తెలుగు హీరోయిన్ ఈషారెబ్బా న‌టించ‌నుంద‌ట‌. తెలుగులో కూడా ల‌స్ట్ స్టోరీస్ త‌ర‌హాలో ఓ బోల్డ్ కంటెంట్ వెబ్‌సిరీస్ రూపొందుతోంది. 
 
అందులో ఓ గృహిణి పాత్ర‌లో ఈషా రెబ్బా న‌టిస్తుంద‌ట. మ‌రి హిందీ ప్రేక్ష‌కులు ఆద‌రించిన రీతిలో తెలుగు ఆడియెన్స్ ఈ బోల్డ్ కంటెంట్‌ను ఆద‌రిస్తారో లేదో చూడాలి. ఏది ఏమైనా, సినీ అవకాశాలు తగ్గిపోయిన పలువురు హీరోయిన్లు ఈ తరహా పాత్రల్లో నటించేందుకు అమితాసక్తిని చూపుతున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్ప కోసం బన్నీ ప్లాన్ ఇదే