Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ నుంచి కొత్త ఫీచర్.. డిసప్పియరింగ్​ మెసేజ్ వచ్చేస్తోంది..

Webdunia
బుధవారం, 28 ఏప్రియల్ 2021 (18:52 IST)
మెస్సేజింగ్​ యాప్​లో అగ్రగామి అయిన వాట్సాప్​, మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. డిసప్పీయరింగ్ మెస్సేజ్ ఫీచర్‌కు సంస్థ తాజాగా అప్‌డేట్ చేసింది. వాట్సాప్ ఇటీవల ప్రకటించిన కొత్త ప్రైవసీ పాలసీ వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది యూజర్లు టెలిగ్రామ్​, సిగ్నల్ వంటి ఇతర ప్రత్యామ్నాయ ప్లాట్​ఫామ్​లకు మారుతున్నారు. 
 
దీన్ని దృష్టిలో పెట్టుకొని తమ యూజర్లు చేజారకుండా ఉండేందుకు వాట్సాప్​ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా గతేడాది వాట్సాప్​ డిసప్పియరింగ్​ మెసేజ్​ అనే ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్​తో మీరు పంపిన మెసేజ్​లు వారం రోజుల తర్వాత ఆటోమేటిక్​గా డిలీట్​ అయ్యేవి. 
 
అయితే ఇప్పుడు ఈ సమయాన్ని 24 గంటలకు తగ్గించేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది. కొత్త అప్‌డేట్ తరువాత డిసప్పియరింగ్​ మెసేజెస్​ ఫీచర్​.. 7 రోజులు, 24 గంటలు, ఏదీ కాదు అనే మూడు ఆప్షన్లతో అందుబాటులోకి రానుంది. దీని ద్వారా యూజర్లు వాట్సాప్ మెస్సేజ్‌ల​ను 24 గంట్లలో ఆటోమేటిక్​గా డిలీట్ చేయవచ్చు.
 
ఈ కొత్త ఫీచర్​ను ఆండ్రాయిడ్​, ఐఓఎస్​, వెబ్​/డెస్క్​ వెర్షన్లలో వాట్సాప్​ పరీక్షిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డిసప్పియరింగ్​ ఫీచర్​ ప్రకారం 7 రోజుల వరకు మెసేజ్​లు డిలీట్​ అవ్వకుండా ఉంటాయి. 
 
అయితే రానున్న కొత్త అప్‌డేట్‌తో 24 గంటల్లో మెస్సేజ్‌లు డిలీట్​ అవుతాయి. దీని వల్ల కొన్నిసార్లు యూజర్​లు ముఖ్యమైన మెసేజ్‌లను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ ఫీచర్​లో టైమర్ ఆప్షన్‌ను జోడించనున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా టైమర్​ ఆప్షన్​ను కూడా వాట్సాప్​ పరీక్షిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెస్టివల్స్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న వేదిక మూవీ ఫియర్

ఏఆర్.రెహ్మాన్ తండ్రిలాంటివారు... ఆ సంబంధం అంటగట్టొద్దు ప్లీజ్ : మోహిని డే

రామ్ చరణ్ తాజా టైటిల్ పెద్ది - మైసూర్ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ?

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments