Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రెమ్‌డెసివర్ దివ్యౌషధమేమీ కాదు.. ఆ ఇంజక్షన్లు కావాలంటే వాట్సాప్ చేయండి..

Advertiesment
remdesivir
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (10:57 IST)
కరోనా చికిత్సలో వినియోగిస్తున్న యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్‌ ప్రాణాల్ని కాపాడే దివ్యౌషధమేమీ కాదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ ఔషధాన్ని అనవసరంగా, ఎలాంటి సహేతుకత లేకుండా వినియోగించడం అనైతిక చర్య అవుతుందని తెలిపింది. రెమ్‌డెసివిర్‌ అత్యవసర వినియోగం కింద వాడేందుకు అనుమతించిన ప్రయోగాత్మక ఔషధం మాత్రమేనేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 
 
ఇది ఆసుపత్రిలో చేరిన వారికి వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇవ్వాలని కూడా కేంద్రం పేర్కొంది. అయినా సరే రెమ్‌డెసివిర్‌ కోసం జనం రోజూ పడిగాపులు పడుతూనే ఉన్నారు. దీంతో కూకట్‌పల్లి వై జంక్షన్‌ వద్ద హెటిరో కంపెనీ ఔట్‌లెట్‌ వద్ద విక్రయిస్తున్న రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్‌ను ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే అందించాలని నిర్ణయించారు. 
 
ఔట్‌లెట్‌ వద్దకు ప్రజలు రావొద్దని వాట్సాప్‌లో వివరాలిస్తే మందును ఎప్పుడు అందిస్తామో వారి ఫోన్‌కే మెసేజ్‌ వస్తుందని తెలిపారు. మంగళవారం కంపెనీ గేటు ముందు రెమ్‌డెసివిర్‌ కేవలం వాట్సాప్, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా మాత్రమే అనే బోర్డును ఏర్పాటు చేశారు.
 
రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కావాల్సిన వారు రోగి పేరు, ఐపీ నంబర్, అటెండర్‌ పేరు, మొబైల్‌ నంబర్, ఆస్పత్రి పేరు, నగరం పేరు, ఇంజక్షన్ల సంఖ్య వివరాలను మొబైల్‌ నంబర్‌ 91338 96969కు వాట్సాప్‌ గానీ, మెసేజ్‌గానీ పంపించాలని కోరారు. 
 
మందును ఎప్పుడు అందజేస్తామో వారి ఫోన్‌కే మెసేజ్‌ వస్తుందని అప్పుడు మాత్రమే వచ్చి తీసుకెళ్లాలని తెలిపారు. అయితే ఈ విషయం తెలియని రోగి బంధువులు కంపెనీ ఔట్‌లెట్‌ వద్దకు రావటంతో కూకట్‌పల్లి పోలీసులు బందోబస్తు నిర్వహించి ప్రజలకి సూచనలు అందజేసి వారిని పంపించివేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబైలో కుప్పకూలిన ఆరోగ్య వ్యవస్థ.. చేతులెత్తేసిన వైద్యులు (Video)