Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్ యూజర్లకు ఒక గుడ్ న్యూస్... ఇక అప్పు కూడా తీసుకోవచ్చు.. తెలుసా?

Webdunia
గురువారం, 23 జులై 2020 (17:12 IST)
వాట్సాప్ యూజర్లకు ఒక గుడ్ న్యూస్. ఈ యాప్ ద్వారా ఇకపై అప్పు కూడా తీసుకోవచ్చు.  త్వరలో వాట్సప్ లెండింగ్, మైక్రోపెన్షన్, ఇన్సూరెన్స్ సేవల్ని ప్రారంభించనుంది. అంటే మీరు వాట్సప్ నుంచే లోన్స్ తీసుకోవచ్చు. ఈ విషయాన్ని వాట్సప్ ఇండియా హెడ్ అభిజిత్ బోస్ గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2020 ఈవెంట్‌లో వెల్లడించారు. 
 
ఇప్పటికే భారత దేశంలో పేమెంట్ సేవల్ని ప్రారంభించేందుకు వాట్సప్ రెండేళ్ల పాటు ప్రయత్నిస్తోంది. 2018 ఫిబ్రవరి నుంచి ఇందుకోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. బీటా స్టేజ్‌లోనే వాట్సప్ పేమెంట్ నడుస్తోంది. పూర్తి స్థాయిలో వాట్సప్ పేమెంట్ సేవలు ప్రారంభం కాలేదు. 
 
ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత వాట్సప్ పేమెంట్ సేవలు యూజర్లందరికీ లభించనున్నాయి. అయితే వాట్సప్ మాత్రం భారతదేశంలో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో అడుగు పెట్టి సేవల్ని విస్తరించేందుకు భారీ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగానే వాట్సప్ పేమెంట్ ద్వారా యూపీఐ సేవల్ని అందించడం మాత్రమే కాకుండా లెండింగ్, మైక్రో పెన్షన్, ఇన్సూరెన్స్ సేవలపైనా దృష్టి పెట్టింది.
 
ఇప్పటికే పరిమిత యూజర్లకు ఇప్పటికే వాట్సప్ పేమెంట్ సర్వీస్ లభిస్తోంది. దేశవ్యాప్తంగా 20 లక్షల మంది యూజర్లు వాట్సప్ పేమెంట్ సేవల్ని పొందుతున్నారు. వాట్సప్ పేమెంట్ యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులతో కలిసి ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను వాట్సాప్ చేపట్టిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

నారా లోకేష్‌ను కలిసిన నటుడు నిఖిల్ సిద్ధార్థ్.. చీరాలలో ర్యాలీ

మాధవీలత స్ట్రాంగ్ ఉమెన్.. ఎలాంటి ప్యాకేజీ తీసుకోలేదు.. రేణు దేశాయ్

బాలక్రిష్ణ 109 వ సినిమా తాజా అప్ డేట్

హీరో అర్జున్ ఆవిషరించిన సహ్య మైథలాజికల్ చిత్ర ఫస్ట్ లుక్

డల్లాస్ లో స్పైసీ టూర్ లో థమన్ ఆ 7వ పాటను రిలీజ్ చేస్తాడా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు పరగడుపున తింటే?

గుండె ధమనుల్లో అడ్డంకులు ఏర్పడకుండా చేసే గింజలు ఇవే

తర్వాతి కథనం
Show comments