Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్కైవ్‌ అనే ఆప్షన్‌కు కొత్త ఫీచర్‌ను జోడించిన వాట్సాప్

Webdunia
గురువారం, 29 జులై 2021 (12:43 IST)
సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్.. గతంలోనే ఉన్న అర్కైవ్‌ అనే ఆప్షన్‌కు కొత్త ఫీచర్‌ను జోడించింది‌. దీని ద్వారా మీ చాట్‌ లిస్ట్‌లో కనిపించకూడదు అనుకునే అర్కైవ్డ్‌ నెంబర్లు, గ్రూప్‌లను యూజర్లు పక్కన పెట్టవచ్చు. గతంలో అర్కైవ్ ఫీచన్‌ను ఎంచుకుంటే.. మళ్లీ ఆ వ్యక్తి లేదా గ్రూప్‌ సభ్యులు మెసేజ్‌ చేసినప్పుడు తిరిగి చాట్ లిస్ట్‌లో కనిపిస్తూ 'అన్- అర్కైవ్‌' అయ్యేది. అయితే ఇప్పుడు కొత్త ఆప్షన్‌లో అలా అర్కైవ్‌ చేసిన కాంటాక్ట్‌ మళ్లీ అన్-అర్కైవ్‌ అవ్వదు.
 
అంటే.. ఆ వ్యక్తి లేదా గ్రూప్ నుంచి కొత్త మెసేజ్ వచ్చినా, అది చాట్ లిస్ట్‌లో కనిపించదు. మళ్లీ మనం సెట్టింగ్స్ మార్చుకుంటేనే తిరిగి మామూలు చాట్‌గా కనిపిస్తుంది. ఈ కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ విడుదల చేసింది. మీ వాట్సాప్ అకౌంట్‌లో ఏదైనా కాంటాక్ట్‌, గ్రూప్‌ను అర్కైవ్‌ చేసి చూస్తే, కొత్త ఫీచర్ కనిపిస్తుంది. 
 
అయితే ఇలా ఆటోమేటిక్ అన్‌అర్కైవ్‌ ఆపేయాలన్నా సాధ్యమే. దీనికోసం వాట్సాప్‌ యాప్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో ఛాట్స్‌ ఆప్షన్‌లోకి వెళ్తే... 'అర్కైవ్‌డ్‌ ఛాట్స్‌' అని ఉంటుంది. డీఫాల్ట్‌గా ఈ ఆప్షన్‌ ఎనేబుల్‌లో ఉంటుంది.
 
మీకు ఈ ఆప్షన్‌ వద్దనుకుంటే దానిని డిజేబుల్‌ చేసుకుంటే సరి. అప్పుడు అర్కైవ్‌ చేసిన వ్యక్తి /గ్రూపులో ఏదైనా మెసేజ్‌ వస్తే గతంలో మాదిరిగా అన్‌ అర్కైవ్‌ అయిపోతుంది. ఇక అర్కైవ్‌ చేసిన గ్రూపు, వ్యక్తి మెసేజ్‌లను హోం స్క్రీన్‌ టాప్‌లో 'అర్కైవ్‌డ్‌' అనే సెక్షన్‌లో చూపిస్తుంటారు.
 
దానికి క్లిక్‌ చేసి మీకు కావాల్సినప్పుడు అందులో మెసేజ్‌లు చూసుకోవచ్చు. వద్దనుకుంటే అక్కడి నుంచే అన్అర్కైవ్‌ చేసుకోవచ్చు. మీరు అర్కైవ్‌ చేసిన విషయం అవతలి వ్యక్తి, గ్రూపు సభ్యులకు తెలియదు కూడా. కొన్నాళ్లపాటు దీనిని టెస్టింగ్‌ చేసిన వాట్సాప్‌ తాజాగా లాంచ్‌ చేసింది. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments