Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్... యూజర్ల కష్టాలకు ఫుల్‌స్టాప్

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది యాజర్ల కష్టాలను తీర్చనుంది. సాధారాణంగా వాట్సాప్‌ను వినియోగించేవారు పొరపాటున ఏదైనా తప్పుగా టైప్ చేసిన మెసేజ్‌ను లేదా పొరపాటున పంపిన మెసేజ్‌ను మనం

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (11:53 IST)
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఇది యాజర్ల కష్టాలను తీర్చనుంది. సాధారాణంగా వాట్సాప్‌ను వినియోగించేవారు పొరపాటున ఏదైనా తప్పుగా టైప్ చేసిన మెసేజ్‌ను లేదా పొరపాటున పంపిన మెసేజ్‌ను మనం ఏమీ చేయలేం. కేవలం మన స్మార్ట్ ఫోన్‌లో మాత్రమే మనం దాన్ని తొలగించగలం. ఎవరికైతే మెసేజ్ పంపించామో... ఆ ఫొన్ నుంచి దాన్ని మనం తొలగించలేం. ఈ కారణంగా, వాట్సాప్ యూజర్లు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
ఇలాంటి వారికి కష్టాల నుంచి తొలగించేందుకు వీలుగా ఈ సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకునిరానుంది. మనం పంపించిన మెసేజ్‌ను ఎడిట్ చేయడం కానీ, లేదా పూర్తిగా తొలగించడం కానీ ఇకపై మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎడిట్ చేస్తే, అవతలి ఫోన్లో కూడా ఎడిట్ చేసిన మెసేజ్ మాత్రమే ఉంటుంది. అలాగే, మనం డిలీట్ చేస్తే, అవతలి ఫోన్ నుంచి కూడా డిలీట్ అవుతుంది.
 
వాబీటాఇన్ఫో (WABetaInfo) సంస్థ తెలిపిన వివరాల ప్రకారం వాట్సప్ బీటా వర్షన్‌లో కొత్తగా రివోక్ అనే బటన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేస్తే, మనం పంపిన మెసేజ్ ఆగిపోతుంది. కేవలం మెసేజ్‌లు మాత్రమే కాదు మనం పంపిన డాక్యుమెంట్లు, ఫొటోలు, వీడియోలను కూడా ఇలాగే తీసేయ్యవచ్చని పేర్కొంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments