Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో... మేము లేవలేం నాయనోయ్... జియో దెబ్బకు వొడాఫోన్ ఉత్తరం...

రిలయెన్స్ జియో దెబ్బకు ఇతర ప్రైవేటు టెలికం కంపెనీలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే భారీ నష్టాలను చవిచూస్తున్న ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు ఇక రిలయెన్స్ ఆఫర్లను తట్టుకోలేక తమను ఆదుకోవాలని టెలికం శాఖకు విన్నపాలు చేస్తున్నాయి. లక్షల్లో వినియోగదారుల ఉండే వొ

Webdunia
బుధవారం, 16 ఆగస్టు 2017 (15:28 IST)
రిలయెన్స్ జియో దెబ్బకు ఇతర ప్రైవేటు టెలికం కంపెనీలు అతలాకుతలమవుతున్నాయి. ఇప్పటికే భారీ నష్టాలను చవిచూస్తున్న ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు ఇక రిలయెన్స్ ఆఫర్లను తట్టుకోలేక తమను ఆదుకోవాలని టెలికం శాఖకు విన్నపాలు చేస్తున్నాయి. లక్షల్లో వినియోగదారుల ఉండే వొడాఫోన్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

నెల తిరిగితే తమ వినియోగదారులు జారిపోతున్నారనీ, భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తోందని తన త్రైమాసిక నివేదికను పరిశీలించిన మీదట తెలియజేస్తోంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వొడాఫోన్ నెంబరును కేవలం రిసీవింగ్ కోసమే ఉపయోగిస్తున్నట్లు తేలిందట. చాలామంది వొడాఫోన్ సిమ్ ద్వారా మాట్లాడకుండా జియో నెంబర్ ద్వారా చేయడం వల్లనే ఇది తలెత్తుతుందన్నది తెలిసిన విషయమే. 
 
మొదట్లో వొడాఫోన్ ఆఫర్లతో అందరినీ ఆకట్టుకున్నది. ఇంతలో రిలయెన్స్ జియో లేవలేని దెబ్బను తీసింది. వివిధ రకాల ఆఫర్లతో వొడాఫోన్ నెట్‌వర్క్ వినియోగదారులే కాదు అన్ని కంపెనీలకు చెందిన వారిని పోర్టబులిటీతో లాగేసుకుంది. దీంతో నష్టాల్లో కూరుకుపోయింది వొడాఫోన్. అయితే రిలయెన్స్ ప్రకటించిన 1500 రూపాయల ఫోన్‌తో పాటు అన్‌లిమిటెడ్ నెట్ ఉచిత కాల్స్‌తో మరింత బెంబేలెత్తిపోయారు ప్రైవేటు టెలికాం ఆపరేటర్లు. 
 
మొదటగా వొడాఫోన్ కంపెనీ ప్రతినిధులు డిఓటికి లేఖ రాశారు. ఇలా ఇష్టమొచ్చినట్లు ఆఫర్లు ప్రకటిస్తే తాము మరింత నష్టాల్లోకి వెళ్ళిపోయే అవకాశముంది. దీన్ని ఖచ్చితంగా మీరు పరిగణలోకి తీసుకుని మమ్మల్ని ఈ గండం నుంచి గట్టెక్కించాలని కోరిందట. ఈ లేఖను స్వీకరించిన టెలికాం కమిషన్ మెంబర్ అనురాధ మిశ్ర దీనిపై త్వరలోనే స్పందిస్తానని ఒక సమాచారాన్ని వొడాఫోన్‌ను చేరవేశారట. టెలికాం కమిషన్ నుంచి వచ్చే సమాధానం కోసమే వొడాఫోన్ కంపెనీ ప్రతినిధులు ఎదురుచూస్తున్నారట. తమకు అనుకూలంగా అది లేకపోతే ఏం చేయాలి దేవుడా అని ఆలోచన చేస్తున్నారట.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments