Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివో నుండి కొత్త స్మార్ట్ వాచ్.. ఫీచర్స్ ఇవే..

Webdunia
సోమవారం, 6 నవంబరు 2023 (10:12 IST)
smartwatch
వివో నుండి కొత్త స్మార్ట్ వాచ్ రాబోతోంది. దీని పేరు వివో వాచ్ 3. ఈ మోడల్ ఈ నెల 13న విడుదల కానుంది. తాజాగా ఈ స్మార్ట్‌వాచ్‌ టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది.
 
Vivo వాచ్ 3 రౌండ్ డయల్‌ను కలిగి ఉంది. ఈ మోడల్ రెండు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. అవి- సిలికాన్ పట్టీతో నలుపు, తోలు పట్టీతో తెలుపు. ఈ వాచ్‌లో బ్లూఓఎస్ అనే కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఇది AI సామర్థ్యాన్ని కలిగి ఉంది. 
 
అలాగే అపరిమిత వాచ్ ఫేస్ సపోర్ట్, యాప్ స్టోర్‌ని పొందవచ్చు. ఇందులో OLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ వివో వాచ్ 3 ఇతర ఫీచర్లపై ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు. 
 
ఇదిలా ఉంటే, ఈ వాచ్‌తో పాటు, వివో కంపెనీ X100 స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను కూడా లాంచ్ చేస్తుందని టాక్ ఉంది. ఇందులో X100, X100 Pro, X100 Pro+ ఉన్నాయి. బేస్ వేరియంట్ ధర రూ. 45,500 ఉండవచ్చు. 
 
ఈ మోడల్‌ను ముందుగా చైనాలో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత భారత్‌లోకి ప్రవేశిస్తుంది. ఇది 120Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
 
ప్రో+ మోడల్‌లో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రా వైట్, 50MP టెలిఫోటో లెన్స్, 200MP పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుందని లీక్‌లు సూచిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్ర‌భాస్ తో ఓ బాలీవుడ్ భామ‌ చేయనంటే.. మరో భామ గ్రీన్ సిగ్నల్ ?

UV క్రియేషన్స్ బ్రాండ్ కు చెడ్డపేరు తెస్తే సహించం

కల్ట్ క్లాసిక్‌లో చిరంజీవి, మహేష్ బాబు కలిసి అవకాశం పోయిందా !

రామాయణ: ది ఇంట్రడక్షన్ గ్లింప్స్‌ ప్రసాద్ మల్టీప్లెక్స్‌లోని PCX స్క్రీన్‌పై ప్రదర్శన

సినిమా పైరసీపై కఠిన చర్యలు తీసుకోబోతున్నాం : ఎఫ్.డి.సి చైర్మన్ దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

తర్వాతి కథనం
Show comments