Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Galaxy ZFold5, Z Flip5 స్మార్ట్ ఫోన్స్‌కి 15 పాప్-అప్ స్టోర్స్‌ను భారతదేశంలో ఆవిష్కరించనున్న Samsung

Advertiesment
Samsung Galaxy A23 5G
, సోమవారం, 2 అక్టోబరు 2023 (22:38 IST)
ఇటీవల విడుదల చేసిన Galaxy Z Fold5, Galaxy Z Flip5, Galaxy Watch6 సిరీస్, Galaxy Tab S9 సిరీస్‌ల గురించి చైతన్యం కలిగించేదుకు భారతదేశం అంతటా 15పాప్-అప్ స్టోర్స్‌ను తెరవనున్నట్లు Samsung ఈ రోజు ప్రకటించింది. మొదటి దశలో, ఢిల్లీ-NCR, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్‌ వంటి అభివృద్ధి చెందిన టియర్ 1 నగరాల్లో ఐదు పాప్-అప్ స్టోర్లు ఏర్పాటు చేయబడ్డాయి. తదుపరి, ఈ పండుగ సీజన్‌లో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి Samsung ఈ పాప్-అప్ స్టోర్‌లను టియర్ II నగరాలతో సహా ఇతర ప్రదేశాలకు విస్తరిస్తుంది.
 
Samsung పాప్-అప్ స్టోర్స్‌ను సందర్శించే వినియోగదారులు Samsung వారి ఐదవ తరానికి చెందిన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అనుభవం పొందడమే కాకుండా, గాలక్సీ శ్రేణి పనిచేస్తుండటం కూడా చూడవచ్చు. ఈ పాప్-అప్ స్టోర్స్‌లో, వినియోగదారులు ప్రత్యేకమైన ప్రత్యక్ష డెమో సమావేశాల్లో కూడా చేరుతారు. కొన్ని ఉత్తేజభరితమైన బహుమతులను కూడా అందుకునే అవకాశం పొందుతారు. కొత్త Galaxy Z సీరీస్ గురించి ఆసక్తికరమైన సలహాలు, ఉపాయాలు కూడా తెలుసుకుంటారు. ఈ ఏడాది, Samsungకు చిన్న పట్టణాలు మరియు నగరాలు నుండి ఫోల్డబుల్స్ కోసం ఎక్కువ డిమాండ్ వచ్చింది. ఫోల్డబుల్ టెక్నాలజీ అనుభవించాలని కోరుకునే వినియోగదారుల సమూహానికి చేరుకోవడంలో కొత్త పాప్-అప్ స్టోర్స్ Samsungకు సహాయపడతాయి.
 
Samsung ఇటీవల ప్రారంభించిన Galaxy ZFold5 మరియు Z Flip5 స్మార్ట్ ఫోన్స్ భారతదేశంలో గొప్ప ప్రారంభాన్ని సాధించాయి, 150,000 ప్రీ-బుకింగ్స్ పొందాయి, ఇది ఇంతకుముందు తరం ఫోల్డబుల్స్ కంటే 1.5 రెట్లు ఎక్కువ. భారతదేశంలో విక్రయించబడుతున్న Galaxy Z Fold5 మరియు Z Flip5 Samsung వారి నోయిడా ఫ్యాక్టరీలో తయారు చేయబడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు ఉత్తేజకరమైన టీవీ మోడల్స్- U7K, U6K, E7Kతో హైసెన్స్ ఇండియా