Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక ట్రూ కాలర్ అవసరం లేదు.. ఫోన్ చేసేది ఎవరో తెలిసిపోతుంది..

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (22:36 IST)
సైబర్ నేరాల నియంత్రణకు గాను కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోంది. ఫేక్ గుర్తింపు కార్డుతో ఎవరైనా నెంబర్ తీసుకుంటే వారికి ఇక చుక్కలే. ఫేక్‌ గుర్తింపు కార్డుతో ఎవరైనా మొబైల్‌ కనెక్షన్‌ గానీ, వోటీటీ కనెక్షన్‌ గానీ తీసుకున్నారని టెలికాం కంపెనీల 'కేవైసీ'లో వెల్లడైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. వారిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు.
 
వివిధ కేసుల దర్యాప్తులో భాగంగా ఫేక్‌ ఐడీ కార్డులతో మొబైల్, వోటీటీ కనెక్షన్‌ తీసుకున్నారని పోలీసులు గుర్తించినా వారిపై కేసు నమోదు చేస్తారు. అలా ఫేక్‌ ఐడీ కార్డుతో కనెక్షన్‌ తీసుకున్నవారికి రూ.50వేల జరిమానా లేదా ఏడాది జైలు లేదా రెండూ విధించేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది.
 
ఈ కేంద్ర ప్రభుత్వం నూతన పాలసీ ప్రకారం తమ కాంటాక్ట్‌ నెంబర్ల జాబితాలో లేని నెంబరు నుంచి కాల్‌ వచ్చినా సరే ఆ ఫోన్‌ చేసింది ఎవరో ఇకపై తెలిసిపోతుంది. ప్రస్తుతం ట్రూ కాలర్‌ యాప్‌ను ఫోన్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే ఆవిధంగా ఎవరు కాల్‌ చేస్తున్నారో తెలుస్తుంది.
 
కానీ, దానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అయితే, ట్రూ కాలర్‌ యాప్‌తో నిమిత్తం లేకుండానే తమకు ఎవరు కాల్‌ చేస్తున్నారో తెలుసుకోవడం ప్రతి మొబైల్‌ ఫోన్‌ వినియోగదారుడికి హక్కుగా కేంద్రం నూతన పాలసీ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేసింది. ఇందుకోసం మొబైల్‌ కంపెనీలు తమ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలని ఆదేశించనుంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments