Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.3.5లకే ఒక జీబీ డేటా.. రిలయన్స్ జియో కొత్త ఆఫర్

Webdunia
సోమవారం, 19 ఏప్రియల్ 2021 (20:45 IST)
రిలయన్స్ జియో సంస్థ మరో ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం రూ. 3.5లకే ఒక జీబీ డేటా అనేది ఈ ప్రకటన సారాంశం. ప్రముఖ టెలికం సంస్థ జియో తాజాగా రూ. 3.50లకే ఒక జీబీ డేటాను అందించనున్నట్లు ప్రకటించింది. రిలయన్స్‌ జియో రూ. 599 రీఛార్జ్‌ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 
 
ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్‌ కాల్స్‌తో పాటు 84 రోజుల వ్యాలిడిటీనిస్తోంది. రోజూ 2జీబీ డేటానందిస్తోంది. అంటే 84 రోజులకు గానూ మొత్తం 168 జీబీ డేటాను జియో అందించనుంది. ఈ క్రమంలో... ఒక జీబీ డేటాకయ్యే ఖర్చు కేవలం మూడున్నర రూపాయలు మాత్రమే.
 
ఇతర ప్లాన్‌లతో పోలిస్తే ఈ ప్లాన్‌ చాలా చౌక అని అర్ధమవుతుంది. ప్రతీరోజు 2జీబీ డేటా అందించే రూ. 249, రూ. 444 ప్లాన్‌ల పోల్చుకుని చూస్తే... ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులు ఉండడం విశేషం. అంటే... 56 రోజులకు గానూ మొత్తం 112 జీబీ డేటా కస్టమర్లకు అందిస్తోంది జియో. ఈ క్రమంలో... ఒక జీబీ డేటా దాదాపు రూ. 4 వరకు చెల్లిస్తున్నట్లు లెక్క.
 
ఇక రూ. 599 ప్లాన్‌లో వినియోగదారులు అపరిమిత ఫోన్‌ కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. అంతేకాదు... జియో టీవీ, జియో సినిమా, జియో న్యూస్‌ తదితర యాప్‌లకు ఉచితంగా సబ్ స్క్రిప్షన్ పొందుతారు కూడా. ఇది మరో ప్రత్యేకత అని జియో వర్గాలు చెబుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments