Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో కూడా షేక్ అవ్వాల్సిందే.. రూపాయికే వన్ జీబీ డేటా

Webdunia
శనివారం, 1 ఫిబ్రవరి 2020 (11:30 IST)
దేశీయ టెలికాం రంగంలోకి ఉచిత ఆఫర్లతో ప్రవేశించి ఇపుడు నంబర్ వన్ కంపెనీగా ఉన్న రిలయన్స్ జియో ఇపుడు షేక్ అవుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ టెలికాం కంపెనీలను షేక్ చేసిన రిలయన్స్ జియో.. ఇపుడు బెంగుళూరుకు చెందిన స్టార్టర్ కంపెనీ వైఫై డబ్బా దెబ్బకు బెంబేలెత్తిపోతోంది. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కేవలం రూ.1 కే.. ఒక జీబీ డేటాను అందించనున్నట్టు సంచలన ప్రకటన చేసింది. 
 
ఈ విషయాన్ని వైఫై డబ్బా సీఈవో కంరం లక్ష్మణ్‌ వెల్లడించారు. అయితే, మొదట ప్రయోగాత్మకంగా బెంగళూరులో ఆ ప్లాన్ అందుబాటులో ఉండగా.. అక్కడ విజయవంతమైతే.. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. 
 
మొబైల్‌ ఫోన్లలో ఓటీపీ ఎంటర్‌ చేయడంతో 'వైఫై డబ్బా'కు ఎవరైనా కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. టీ షాపులు, వ్యాపార కూడళ్లలో ప్రీపెయిడ్‌ కూపన్ల ద్వారా కూడా డేటా సేవలను పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇది జియోకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందంటున్నారు.
 
నిజానికి వైఫై డబ్బా గత 2017 నుంచి డేటా సేవలు అందిస్తోంది. అంతకుముందు 20 రూపాయలకు 1 జీబీ డేటా లభించింది. ఓ నివేదిక ప్రకారం, ఇప్పుడు వైఫై దబ్బాలో ఒక రూపాయికి ఒక జీబీ డేటా అందుబాటులో ఉంది. ఆ సంస్థ నుంచి ఇప్పుడు మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ.2కు 1 జీబీ డేటా, రూ.10కు 5 జీబీ డేటా, రూ.20కు 10 జీబీ డేటా ప్లాన్‌లు లభిస్తున్నాయి. ఈ అన్ని ప్లాన్లు చెల్లుబాటు సమయం 24 గంటలు ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments