Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో సంచలనం.. సరికొత్త రికార్డు.. టెలికాం సంస్థలు బెంబేలు

Webdunia
గురువారం, 21 నవంబరు 2019 (13:22 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత జియోతో సంచలనం సృష్టించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఇంధన దిగ్గజంగా అవతరించింది. దాంతో ఎలైట్ క్లబ్‌లో చేరినట్లైంది. అటు ఆ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఇటు రిలయన్స్ సంస్థలు నంబర్ వన్ దిశగా ముందడుగు వేస్తోంది. ప్రపంచంలోనే మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో బ్రిటీష్ మల్టీ నేషనల్ ఆయిల్ కంపెనీ బీపీని వెనక్కి నెట్టి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆరవ స్థానంలో నిలిచింది. 
 
గత రెండు రోజుల్లోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్స్ 6 శాతం పెరిగాయి. షేర్ విలువ తొలి సారి రూ.1500 మార్కు దాటింది. ప్రస్తుతం రూ.1534 వద్ద కొనసాగుతోంది. ఇక.. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.5 లక్షల కోట్లకు చేరింది. తర్వలోనే రూ.10 లక్షల కోట్ల మార్కెట్ విలువ దాటిన తొలి భారతీయ కంపెనీగా రికార్డు నెలకొల్పనుంది. 
 
వొడాఫోన్ ఐడియా, భారతి ఎయిర్‌టెల్ డిసెంబరు 1 నుంచి టారిఫ్ ఛార్జీలు పెంచుతామని ప్రకటించిన తర్వాత రిలయన్స్ మార్కెట్ విలువ మరింత పెరగడం గమనార్హం. దానివల్ల జియో మరింత మంది యూజర్లను ఆకర్షించే అవకాశం ఉందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాముండేశ్వరి మాత ఆశీస్సులతో ఆర్సీ16 ప్రారంభం

విజయ్ ఇంట్లో రష్మిక దీపావళి వేడుకలు... డేటింగ్‌లో 'గీతగోవిందం' జంట

దణ్ణం పెట్టి చెబుతున్నా... రాజకీయాలకు గుడ్ బై: పోసాని కృష్ణమురళి (video)

పుష్ప-2 వైల్డ్ ఫైర్ కోసం వేచి వుండలేకపోతున్నా బన్నీ.. శిల్పా రవి (video)

చిరంజీవికి, చెర్రీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన నయనతార.. ఎందుకు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments