Webdunia - Bharat's app for daily news and videos

Install App

గణతంత్ర దినోత్సవ ఆఫర్లు : స్మార్ట్ ఫోన్లపై రూ.10వేల క్యాష్ బ్యాక్

భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ-కామర్స్ కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను కుప్పలుతెప్పలుగా గుప్పిస్తున్నాయి. ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ ఆఫర్లను ఇవ్వనున్నాయి.

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (12:12 IST)
భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ-కామర్స్ కంపెనీలు వివిధ రకాల ఆఫర్లను కుప్పలుతెప్పలుగా గుప్పిస్తున్నాయి. ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ ఆఫర్లను ఇవ్వనున్నాయి. ఇందులో స్మార్ట్ ఫోన్లపై రూ.10 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ను ఇవ్వనున్నట్టు ప్రకటించాయి. 
 
కేవలం స్మార్ట్ ఫోన్లపైనే కాకుండా, ల్యాప్ టాప్‌లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ వస్తువులపై రూ.20,000 వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 ప్లస్, వివో వీ7ప్లస్, ఐపాడ్స్, ఈ బుక్ రీడర్లపై ఆఫర్లు ఉన్నాయి. 
 
ఐఫోన్ ఎక్స్ 64జీబీ వెర్షన్ పై క్యాష్ బ్యాక్ ఫోను వాస్తవ ధర రూ.83,899గా ఉంది. ఐఫోన్ ఎక్స్ 256 జీబీ రూ.98,000కే లభిస్తుంది. దీని వాస్తవ విక్రయ ధర రూ.1,02,000. ఇంకా ఐఫోన్ 8 64జీబీ వెర్షన్ ధర రూ.52,706. ఐఫోన్ 8ప్లస్ 64జీబీ ధర రూ.63,470. 
 
అయితే, ఈ స్మార్ట్ ఫోన్లపై క్యాష్ బ్యాక్ కోసం కొనుగోలు సమయంలో ప్రోమో కోడ్‌లను అప్లయ్ చేయాల్సి ఉంటుంది. వివో వీ5ఎస్ 64జీబీ, వివో వై555, వివో వై69, మోటో ఈ4 ప్లస్ 32జీబీ, లెనోవో కేనోట్ 32జీబీ, లెనోవో కే6 పవర్ 32జీబీలపైనా ఆఫర్లున్నాయి.
 
లెనోవో కే8 32జీబీ ఫోన్ ధర రూ.8,170గా ఉంది. ప్రోమో కోడ్ MOB12ను అప్లయ్ చేయడం ద్వారా దీనిపై రూ1,114 క్యాష్ బ్యాక్ పొందొచ్చు. వివో వీ7ప్లస్ 64జీబీ, ఎంఆర్పీ రూ.22,990 కాగా, దీనిపై రూ.2,199 క్యాష్ బ్యాక్ అందుకోవచ్చు. మోటరోలా మోటో జెడ్ ప్లే32జీబీ రూ.17,327కే లభిస్తోంది. అలాగే ఇతర స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా వివిధ రకాల ఆఫర్లను ప్రకటించాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సరైన అనుమతులు లేకుండా ఫామ్‌హౌస్‌ నిర్మాణం-నటుడు అలీకి నోటీసులు

పుష్ప-2 రికార్డు బద్ధలు: కిసిక్ సాంగ్‌ రిలీజ్.. ఎప్పుడంటే?

2025లో పెళ్లి పీటలెక్కనున్న తమన్నా- విజయ్ వర్మ?

రంగస్థలం.. గేమ్ ఛేంజర్.. సైకిల్ తొక్కుతున్న చెర్రీ.. టీడీపీ క్యాడర్ హ్యాపీ?

డాకు మహారాజ్ యాభై రోజుల్లో మీముందుకు రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments