జియో మాస్ ప్లాన్... రూ.98కే అన్‌లిమిటెడ్ కాలింగ్

దేశంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న రిలయన్స్ జియో మరో ఆకర్షణీయమైన ప్లాన్‌తో ముందుకువచ్చింది. జియో మాస్ ప్లాన్ పేరుతో దీన్ని ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.98కే ఉచిత కాలింగ్ సౌకర్యంతో పాటు నెలకు 2జీ

Webdunia
గురువారం, 25 జనవరి 2018 (12:35 IST)
దేశంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్న రిలయన్స్ జియో మరో ఆకర్షణీయమైన ప్లాన్‌తో ముందుకువచ్చింది. జియో మాస్ ప్లాన్ పేరుతో దీన్ని ప్రకటించింది. ఈ ప్లాన్ కింద రూ.98కే ఉచిత కాలింగ్ సౌకర్యంతో పాటు నెలకు 2జీడీ డేటాను ఇవ్వనుంది. ఈ ప్లాన్ కాలపరిమితి 28 రోజులు. మరింత మంది కస్టమర్లను సంపాదించేందుకు రిలయన్స్ జియో ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది. 
 
దేశంలో జియో టెలికాం సేవలు ప్రారంభమైన తర్వాత అతి తక్కువ ధరలకే 4జీ డేటా సేవలను అందుబాటులోకి తెచ్చి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ రంగంలో అప్పటికే ఉన్న కంపెనీలకు జియో తేరుకోలని షాకిచ్చింది. ఇపుడు మరోసారి ధరల యుద్ధానికి తెరతీసింది. జియో తాజాగా ప్రకటించిన రూ.98 ప్లాన్‌ను ప్రకటించింది. 
 
ఈ ప్రాన్ ప్రకటించిన తర్వాత భారతీ ఎయిర్‌టెల్ షేరు విలువ 6.51 శాతం, ఐడియా కంపెనీ షేరు విలువ రూ.5.38 శాతం మేరకు పడిపోయింది. ఈ ప్లాన్‌పై టెక్ నిపుణులు స్పందిస్తూ, జియో మాస్ ప్లాన్ వల్ల సగటున ఓ యూజర్ నుంచి వచ్చే ఆదాయం (ఏఆర్‌పీయూ) మరింత తగ్గుతుందని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది. జియో 98 ప్లాన్ అర్థవంతమైన ప్లాన్ అని క్రెడిట్ సూసే పేర్కొంది. దీనివల్ల పోటీ సంస్థలకు మరిన్ని నష్టాలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని అంచనా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments