Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో దూకుడు... ప్రైవేట్ టెలికాం కంపెనీల బేజారు

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (21:24 IST)
రిలయన్స్ జియో దూకుడు కొనసాగుతోంది. దీంతో ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలు బేజారైపోతున్నాయి. దేశంలో రిలయన్స్ జియో సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర కంపెనీలు తేరుకోలేని విధంగా దెబ్బతిన్న విషయం తెల్సిందే. టెలికాం రంగంలో జియో సృష్టించిన సునామీ ఇప్పటికీ కొనసాగుతోంది. 
 
ఫలితంగా జియో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తూనేవుంది. ఫలితంగా జూన్ నెలలో ఏకంగా 8.26 మిలియన్ మంది కొత్త మొబైల్ ఫోన్ యూజర్లను చేర్చుకుంది. దీంతో జియో సబ్‌స్క్రైబర్ల బేస్ 331.2 మిలియన్లకు చేరుకుంది. 
 
అదే సమయంలో వొడాఫోన్ ఐడియా 4.1 మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయింది. దేశంలోని మూడో అతిపెద్ద టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ 29,883 మంది ఖాతాదారులను కోల్పోయింది. దీంతో జూన్‌ చివరి నాటికి ఆ సంస్థ ఖాతాదారుల సంఖ్య 320.35 మిలియన్లుగా ఉంది.
 
ఇకపోతే, జూన్ మాసాంతానికి వొడాఫోడ్ ఐడియాలు సంస్థలు కలిపి తమ ఖాతాదారుల సంఖ్యను 320 మిలియన్లుగా చూపించగా... టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ మాత్రం 383.41 మిలియన్లుగా చెబుతోంది. అలాగే, భారతీ ఎయిర్‌టెల్ జూన్‌ మాసాంతానికి తమ ఖాతాదారుల సంఖ్యను 281.13 మిలియన్లుగా పేర్కొనగా, ట్రాయ్ మాత్రం 320.35 మిలియన్లుగా చూపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments