మరింత పవర్‌ఫుల్‌గా రానున్న ‘రెడ్‌మి నోట్ 7 ప్రో’!

Webdunia
మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (18:14 IST)
48 మెగాపిక్సెల్స్ కెమెరాతో మార్కెట్‌లో సంచలనం సృష్టించేసిన... రెడ్మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఇందులోనే శక్తివంతమైన వేరియంట్ ఒకటి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఈ ఫోన్‌కు సంబంధించిన 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ అందుబాటులోకి రానుంది.
 
రెడ్‌మి నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ఇప్పటిదాకా 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ బుధవారం నుంచి 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ ఇండియా ప్లాట్‌ఫామ్స్‌పై ఏప్రిల్ 10వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుండి ఈ ఫోన్ విక్రయం ప్రారంభం కానుంది.
 
ఇకపోతే ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్, 6.3 అంగుళాల స్క్రీన్, 48 ఎంపీ, 5 ఎంపీ డ్యూయెల్ రియర్ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరా వంటి ప్రత్యేకతలు అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.13,999గా ఉంటూండగా... ఇక 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ.16,999గా ఉండనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments