భారత మార్కెట్లోకి రియల్ మీ 10 4జీ ఫోన్ విడుదలైంది. రియల్ మీ 10 4జీ ఫోన్‌లో 90 హెర్జ్ అమోల్డ్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి వుంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 33 వాట్ ఫాస్ట్ చార్జర్ వస్తుంది. రియల్ మీ 10, 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ ధర రూ.13,999. ఈ నెల 15న ఫ్లిప్ కార్ట్‌తో పాటు, రియల్ మీ పోర్టల్‌పై అమ్మకాలు మొదలవుతాయి.
రియల్ మీ 10 ప్రో 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ ధర రూ. 18,999 కాగా, రియల్ మీ 10 ప్రో ప్లస్ ధర రూ.24,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఫోనుకు వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ కెమెరా, మరో రెండు సెన్సార్లు, ముందు భాగంలో 16 మెగాపిక్సల్ కెమెరా వుంటుంది