Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు షాకిచ్చిన హైకోర్టు

Webdunia
మంగళవారం, 10 జనవరి 2023 (14:01 IST)
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తేరుకోలేని షాకిచ్చింది. సోమేష్ కుమర్ తన సొంత కేడర్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. ఏపీ కేడర్‌కు చెందిన ఈ ఐఏఎస్ అధికారి.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్నారు. ఇపుడు ఆయన తన సొంత రాష్ట్రానికి వెళ్లాలంటూ ఆదేశించింది. ఆయన వ్యక్తిగత న్యాయవాది విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. 
 
కాగా, ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనను కూడా కేంద్రం పూర్తి చేసింది. ఈ కేటాయింపుల్లో భాగంగా, ఏపీ కేడర్‌కు చెందిన సోమేష్ కుమార్ ఆయన సొంత రాష్ట్రానికే కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. 
 
తెలంగాణ రాష్ట్రానికి సోమేశ్ కుమార్ సేవలు అవసరమని భావిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో డిప్యూటేషన్‌పై కొనసాగవచ్చని తెలిపింది. కానీ, ఈ నిర్ణయంపై డీవోపీటీ హైకోర్టును ఆశ్రయించడంతో దీన్ని విచారించిన హైకోర్టు ధర్మాసనం.. గతంలో ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని తాజాగా తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హారర్ చిత్రం రా రాజా ఎలా ఉందంటే.. రా రాజా రివ్యూ

పింటు కి పప్పీ మైత్రి మూవీ మేకర్స్ ద్వారా కిస్ కిస్ కిస్సిక్ గా విడుదల

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ జాక్ నుంచి ఫస్ట్ సింగిల్ పాబ్లో నెరుడా రిలీజ్

మైండ్ స్పేస్ ఎకో రన్ లో ఆకట్టుకున్న సంతాన ప్రాప్తిరస్తు టీజర్

ఎన్నో కష్టాలు పడ్డా, ల్యాంప్ సినిమా రిలీజ్ కు తెచ్చాం :చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

ప్రతిరోజూ పసుపు, జీలకర్ర నీటిని తీసుకుంటే..? మహిళల్లో ఆ సమస్యలు మాయం

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

మహిళలు బెల్లం ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments