Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జై హింద్' .. పవన్ ట్విట్టర్ ఫాలోయర్ల సంఖ్య ఇదీ...

జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరింది. దీంతో పవన్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో "జై హింద్" అంటూ పేర్కొన్నాడ

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (11:03 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరింది. దీంతో పవన్ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో "జై హింద్" అంటూ పేర్కొన్నాడు. 
 
జ‌న‌సేన పార్టీతో రాజ‌కీయ నాయ‌కుడిగా మారిన పవ‌న్ ఒక‌వైపు సినిమాల‌తో బిజీగా ఉంటూనే మ‌రో వైపు స‌మాజంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ని త‌న వంతు బాధ్య‌త‌గా ప‌రిష్క‌రించుకుంటూ వెళుతున్నారు. రీసెంట్‌గా వ్యవసాయ విద్యార్థుల సమస్యలను, వారికి జరుగుతున్న అన్యాయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్న పవన్ వెంటనే వారికి న్యాయం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
అలాగే, ఉద్దానం స‌మస్య‌ని కూడా చాలా సీరియ‌స్‌గా తీసుకొని దాని ప‌రిష్కారం కోసం ప‌లువురితో ద‌ఫాలుగా చ‌ర్చ‌లు జ‌రుపుతూ వ‌స్తున్నారు. జ‌న‌సేన పార్టీని స్థాపించిన త‌ర్వాత‌ ప‌వన్ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారు. 2014 ఆగస్టులో తన ట్విటర్‌ ఖాతాను ప్రారంభించిన ప‌వ‌న్ చివ‌రిగా బెంగుళూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ దారుణ హత్య ఘటనపై చివ‌రిగా స్పందించారు. అయితే ఈ రోజుతో ప‌వన్ ఫాలోవ‌ర్స్ సంఖ్య‌ రెండు మిలియ‌న్స్‌కి చేరింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీడియాకు దూరంగా నాగచైతన్య, సాయిపల్లవి వుండడానికి కారణం ఇదే

'గేమ్ ఛేంజర్‌'లో మంచి సందేశం ఉంది : నిర్మాత దిల్ రాజు

ల‌క్నోలో 9న గేమ్ చేంజర్ టీజర్, తమిళ సినిమాలూ నిర్మిస్తా : దిల్ రాజు

సంగీత దర్శకుడు కోటి అభినందనలు అందుకున్న తల్లి మనసు

యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రోటి కపడా రొమాన్స్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు తగ్గించుకునే మార్గాలు

కండలు పెంచాలంటే ఇవి తినాలి, ఏంటవి?

టీ అతిగా తాగితే ఏమవుతుంది?

అవకాడో పండు ఎందుకు తినాలి?

శీతాకాలంలో తినవలసిన ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments