Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఫోన్‌ 8, 8+, ఐఫోన్ ఎక్స్ విడుదల... ఫీచర్లివే...

యాపిల్ కంపెనీ తన తాజా ఐఫోన్స్ మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఐఫోన్‌ 8, 8+, ఐఫోన్‌ ఎక్స్‌ (దీన్ని ఐఫోన్‌ 10గా వ్యవహరిస్తున్నారు). ఐఫోన్‌ 8 మోడళ్లు రెండూ సిల్వర్‌, స్పేస్‌ గ్రే రంగులతోపాటు.. కొత

Webdunia
బుధవారం, 13 సెప్టెంబరు 2017 (10:44 IST)
యాపిల్ కంపెనీ తన తాజా ఐఫోన్స్ మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఐఫోన్‌ 8, 8+, ఐఫోన్‌ ఎక్స్‌ (దీన్ని ఐఫోన్‌ 10గా వ్యవహరిస్తున్నారు). ఐఫోన్‌ 8 మోడళ్లు రెండూ సిల్వర్‌, స్పేస్‌ గ్రే రంగులతోపాటు.. కొత్తగా బంగారవు వర్ణంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్లలోని ఫీచర్లను పరిశీలిస్తే.. 
 
ఐఫోన్‌ 8ను 4.7 అంగుళాల టచ్ స్క్రీన్, వెనుకవైపు 12 మెగాపిక్సెల్‌ కెమెరా, 1080పి హెచ్‌డీ నాణ్యతతో స్లోమోషన్‌ వీడియోలను, 4కే వీడియోలను దీంతో తీయవచ్చు. వైర్‌లెస్‌ చార్జింగ్‌ సదుపాయం ఉంది.
 
అలాగే, ఐఫోన్‌ 8+ను 5.5 అంగుళాల టచ్ స్క్రీన్, వైడ్‌యాంగిల్‌ లెన్స్‌, టెలిఫొటో లెన్స్‌తో కూడిన 12-మెగాపిక్సెల్‌ డ్యూయల్‌ కెమెరా దీని ప్రత్యేకతలు. ఈ రెండు మోడళ్లూ 64 జీబీ, 256 జీబీ వేరియంట్లలో లభిస్తాయి. వీటి ధరలను వరుసగా రూ.45 వేలు, రూ.51 వేలుగా నిర్ణయించారు. భారత్‌లో మాత్రం ఈ ధరలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. 
 
ఇక ఐఫోన్‌ ఎక్స్‌ను ఐఫోన్ టెన్‌గా పిలుస్తున్నారు. యాపిల్‌ ఇప్పటిదాకా విడుదల చేసినవాటన్నిటిలోకీ మెరుగైనది. 5.8 అంగుళాల సూపర్‌ రెటీనా ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే తెర, డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌ దీని ప్రత్యేకతలు. ఈ ఫోన్‌ తెర పైనుంచి కింద దాకా, ఆ పక్క నుంచి ఈ పక్క దాకా మొత్తం (ఫుల్‌ స్క్రీన్‌) డిస్‌ప్లే ఉంటుంది. గత మోడళ్లలో లేని ప్రత్యేకత ఇది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments