ఎయిర్‌టెల్ ఆఫర్... ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యం...?
రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకురానుంది. వచ్చేవారం నుంచి ఎయిర్‌టెల్ కూడా 4జీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అయిన VoLTEని ప్
రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునేందుకు ప్రైవేట్ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకురానుంది. వచ్చేవారం నుంచి ఎయిర్‌టెల్ కూడా 4జీ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ అయిన VoLTEని ప్రవేశపెట్టనుందని ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
తొలుత 4జీ డేటా నెట్‌వర్క్ ఆధారంగా VoLTE కాల్స్‌ను చేసుకునే అవకాశం ఉండటంతో ఇక ఎయిర్‌టెల్ కూడా ఉచిత కాల్స్ సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులోభాగంగా తొలుత ముంబై, కోల్‌కతాలతో పాటు దేశంలోని మెట్రోపొలిటన్ సిటీల్లో ఎయిర్‌టెల్ ఈ సర్వీసులను ప్రారంభించనుందని ఆ కథనంలో పేర్కొంది.
అయితే, దీనిపై ఎయిర్‌టెల్ నుంచి అధికారికంగా ఓ ప్రకటన వెలువడాల్సి ఉంది. దేశంలో ఇప్పటివరకు ఈ సౌకర్యాన్ని అందిస్తోన్న ఏకైక కంపెనీగా ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ఉన్న గుర్తింపు పొందిన విషయం తెల్సిందే.