కోట్ల ధర పలుకుతున్న యాపిల్ కంప్యూటర్..

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (19:21 IST)
computer
యాపిల్‌ కంప్యూటర్‌ ధర కోట్లలో పలుకుతోంది. అది మామూలు కంప్యూటర్ కాదు.. యాపిల్‌ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌.. స్టీవ్‌ వొజ్నియాక్‌ 1976లో ఆవిష్కరించిన తొలి యాపిల్‌ 1 కంప్యూటర్‌ అది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కృష్ణ బ్లాకే అనే వ్యక్తి ఈ యాపిల్‌ 1 కంప్యూటర్‌ను 1978లో కొనుగోలు చేశాడట. ప్రస్తుతం దీన్ని ఈ-బేలో అమ్మకానికి పెట్టాడు. ఇప్పటికీ కంప్యూటర్‌ పని చేస్తుండటం విశేషం. 
 
చెక్కపెట్టెలో కీబోర్డుతో ఉండే ఈ కంప్యూటర్‌ ధర 15లక్షల డాలర్లు(రూ. 11కోట్లు)గా నిర్ణయించాడు. షిప్పింగ్‌ ఛార్జి 450 డాలర్లు(రూ.32వేలు) అదనం. విదేశాలకు పంపాల్సి వస్తే అంతర్జాతీయ ఛార్జీలు వర్తిస్తాయి. కొనుగోలు చేసే వారికి ఈ కంప్యూటర్‌తోపాటు దీన్ని ఎలా ఉపయోగించాలో తెలిపే మాన్యువల్‌ బుక్‌.. ఔట్‌పుట్‌ కోసం సోనీ టీవీ-115 మానిటర్‌ వస్తాయి. 
 
ఈ కంప్యూటర్‌లో బేసిక్‌ లాంగ్వేజ్‌, గేమ్స్‌, లో అండ్‌ హై మొమోరీ టెస్ట్‌, యాపిల్‌ 30వ వార్షికోత్సవం వీడియో ఉన్నాయట. ''ఈ కంప్యూటర్‌ ఎంతో విలువైనది. పాడయ్యే లేదా దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉంది. అందుకే కొత్త యజమాని చెంతకు చేరేవరకు ఈ కంప్యూటర్‌ను ఫ్లోరిడాలోని బ్యాంక్‌ లాకర్‌లో భద్రంగా దాచిపెట్టాను''అని కృష్ణ వెల్లడించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Venu Swamy: రామ్ చరణ్- ఉపాసనల ట్విన్ బేబీస్.. వేణు స్వామి జ్యోతిష్యం తప్పిందిగా?

Upasana: రామ్ చరణ్, ఉపాసనకు ట్విన్ బేబీస్ రానున్నారా? (video)

Rebel Star Prabhas: ఫ్యాన్స్ లేకపోతే నేను జీరో అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Chiranjeevi.: సూపర్ స్టార్ చిరంజీవి.. విశ్వంభర.. ఎప్పుడొస్తుందో తెలుసా..

Chandini Chowdhury : యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా చాందినీ చౌదరి... సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments