Webdunia - Bharat's app for daily news and videos

Install App

మార్చి 11 నుంచి నథింగ్‌ ఫోన్‌ 3a అమ్మకాలు ప్రారంభం: అతి తక్కువ ధర ₹19,999 నుంచి లభ్యం

ఐవీఆర్
సోమవారం, 10 మార్చి 2025 (23:26 IST)
లండన్‌కు చెందిన టెక్నాలజీ కంపెనీ నథింగ్‌ మార్చి 11 నుంచి నథింగ్‌ ఫోన్‌ (3a) సిరీస్‌ సేల్స్‌ భారతదేశవ్యాప్తంగా ఫ్లిప్‌కార్ట్‌, విజయ్‌ సేల్స్‌, క్రోమా సహా అన్ని ప్రముఖ రిటెయిల్స్‌ స్టోర్స్‌లో ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేక ఆఫర్‌గా తొలి రోజు ఫోన్‌ (3a) అతి తక్కువ ధర ₹19,999, ఫోన్‌ (3a) ప్రో అతి తక్కువ ధర ₹24,999కి(అన్ని ఆఫర్లు కలుపుకొని) లభిస్తాయి.
 
కెమెరాలో ప్రధాన అప్‌గ్రేడ్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫోన్‌(3a) సిరీస్‌ను మార్చి 4, 2025న నథింగ్‌ విడుదల చేసింది. ఫోన్‌ (3a)లో 50MP మెయిన్ సెన్సర్‌, సోనీ అల్ట్రా-వైడ్‌ సెన్సర్‌, 2x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP టెలిఫొటో లెన్స్‌ ఉన్నాయి. ఫోన్‌ (3a) ప్రోలో పెరిస్కోప్‌ కెమెరా, 60x ఆల్ట్రా జూమ్‌ ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్‌ (3a)లో 32MP ఫ్రంట్‌ కెమెరా ఉండగా, ప్రో మోడల్‌లో 50 MP సెన్సర్‌తో 4K వీడియో రికార్డింగ్ ఫీచర్ ఉంది.
 
రెండింటిలోనూ ఉన్న స్నాప్‌డ్రాగన్‌ 7s జెన్ 3 మొబైల్‌ ప్లాట్‌ఫామ్‌, 5000mAh బ్యాటరీలు ఫుల్‌ ఛార్జ్ చేస్తే రెండు రోజులపాటు చక్కగా పనిచేస్తాయి.  అప్‌గ్రేడ్‌ చేసిన 50W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ కలిగిన ఫోన్‌ (3a) సిరీస్‌ 20 నిమిషాల్లో ఒక రోజుకు కావాల్సిన పూర్తి (50%) పవర్‌ అందిస్తుంది. రెండు ఫోన్లలోనూ 6.77 ఇంచుల స్క్రీన్‌ సైజుతో ఫుల్‌ HD+ రెజల్యుషన్‌ ఉంది. 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, స్క్రీన్‌లోన్ ప్రతీ ఇంచులో 387 పిక్సెల్స్‌ ఉండటం వల్ల విజువల్స్‌ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. గేమింగ్‌ మోడ్‌లో 1000hz శాంప్లింగ్‌ రేటును డిస్‌ప్లే అందిస్తుంది కాబట్టి గేమింగ్‌ హాయిగా, స్పందనాత్మకంగా ఉంటుంది.
 
స్టెబిలిటీ, యుటిలిటీ, కస్టమైజేషన్‌కు అనుకూలంగా నథింగ్‌ ఫోన్‌ 3(a) సిరీస్‌ నథింగ్‌ OS 3.1, ఆండ్రాయిడ్‌ 15పై పనిచేస్తుంది. ఇందులో నథింగ్ గ్యాలరీ, కెమెరా, వెదర్‌ యాప్స్‌కు అప్‌డేట్స్‌ కూడా ఉంటాయి. అలాగే మూడేళ్ల వరకు ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, ఆరు సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఉంటాయి. నోట్స్‌, ఐడియాస్‌ కోసం AI-శక్తితో కూడిన ఎసెన్షియల్‌ స్పేస్‌ను ఈ సిరీస్‌ పరిచయం చేస్తుంది. ఎసెన్షియల్‌ కీ (ఫోన్‌ కుడివైపున ఉంటుంది) ద్వారా వేగంగా యాక్సెస్‌ చేసుకొని కంటెంట్‌ సేవ్‌ చేసుకోవచ్చు, వాయిస్‌ నోట్స్‌ కోసం లాంగ్ ప్రెస్‌, సేవ్‌ చేసిన ఐటెమ్స్‌ చూసేందుకు డబుల్‌ ట్యాప్‌ చేయవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nagarjuna: పూరీ జగన్నాథ్, నాగార్జున చిత్రం షురు - తాజా న్యూస్

Priyanka: ప్రియాంక చోప్రా ను ఒంటరిగా రమ్మన్నాడు : ప్రియాంక తల్లి ఆరోపణ

Ketika Sharma: నితిన్.. రాబిన్‌హుడ్‌లో కేతిక శర్మను ప్రజెంట్ చేస్తూ స్పెషల్ సాంగ్

పొయెటిక్ మూవీ కాలమేగా కరిగింది విడుదల కాబోతుంది

శ్రీకాంత్ ఓదెల కథతో Al అమీనా జరియా రుక్సానా- గులాబీ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వైజాగ్‌ను ప్రకాశవంతంగా మార్చిన బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

కాలిఫోర్నియా బాదంతో ఈ హోలీని ఆరోగ్యకరంగా, ప్రత్యేకంగా చేసుకోండి

ICE Apples: వేసవి కాలం తాటి ముంజలు.. మహిళల్లో ఆ సమస్యలుండవ్.. ఏంటవి?

Summer: వేసవిలో పిల్లలను రక్షించడం ఎలా..? మసాలా ఫుడ్, ఫ్రిజ్ నీరు వద్దు..

వేసవిలో సబ్జా వాటర్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments