భార్యశీలాన్ని శంకించాడు ఓ భర్త. అంతటితో ఆగకుండా తన ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సేలం, ఆత్తూరు సమీపం, కృష్ణాపురం గ్రామంలో భార్యశీలాన్ని శంకించాడు. తన ఇద్దరు పిల్లను కత్తితో హత్య చేశాడు.
అంతటితో ఆగకుండా భార్యపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణాపురంలో అశోక్‌కుమార్ (42), తవమణి (38) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి విద్యారాణి (13), అరుళ్‌కుమారి (13) అనే ఇద్దరు కుమార్తెలు, అరుళ్ ప్రకాష్ (5) అనే కుమారుడున్నాడు. తాగుడుకు అలవాటు పడిన అశోక్‌కుమార్ భార్యను అనుమానించేవాడు. తవమణి శీలాన్ని శంకిస్తూ కొడుకు తనకు పుట్టలేదంటూ తవమణితో గొడవపెట్టుకున్నాడు.
బుధవారం ఉదయం మరింత తాగి ఇంటికి చేరుకున్న అశోక్‌కుమార్ వేటకొడవలితో నిదురపోతున్న భార్యా, ముగ్గురు పిల్లలపై దాడి జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యారాణి, అరుళ్ ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందారు. తవమణి, అరుళ్‌కుమారి తీవ్రంగా గాయపడ్డారు.
నలుగురు మృతి చెందారని అనుకున్న అశోక్‌కుమార్ వేటకొడవలితోనే పక్కింటో దూరాడు. అతడిని చూసిన ఆ ఇంటిలోనివారు కేకలు వేశారు. పక్కింటివారు భయంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.