Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోకియా నుంచి జీ10, జీ20 స్మార్ట్ ఫోన్లు.. అదీ బడ్జెట్ ధరలో..?

Webdunia
గురువారం, 13 మే 2021 (12:56 IST)
Nokia G10
దిగ్గజ మొబైట్ సంస్ధ నోకియా దేశీయ మార్కెట్లో సత్తాచాటాలని ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పలు రకాల స్మార్ట్ ఫోన్లు దేశంలో లాంచ్ చేసింది. సామ్ సాంగ్, మోటో, షియోమి, పోకో వంటి ఫోన్లకు పోటీగా బడ్జెట్ మొబైల్స్ త్వరలోనే లాంచ్ చేయనుంది. జీ10, జీ20 స్మార్ట్ ఫోన్లు త్వరలో కానున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లు మనదేశంలో రూ.15 వేలలోపు ధరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
 
నోకియా జీ10, జీ20 స్మార్ట్ ఫోన్లు ఈ రెండు ఫోన్లూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ కూడా పొందాయి. ఈ విషయాన్ని ప్రముఖ టిప్ స్టర్ ముకుల్ శర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. 
 
దీన్ని బట్టి ఈ రెండు ఫోన్లూ త్వరలో మనదేశంలో లాంచ్ అవుతాయని అనుకోవచ్చు. నోకియా జీ10 మొబైల్ TA-1334 మోడల్, నోకియా జీ20 స్మార్ట్ ఫోన్ TA-1365 మోడల్ నంబర్‌తో ఆన్‌లైన్‌లో దర్శనిమిచ్చాయి.
 
నోకియా జీ10 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్
6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లే
యాస్పెక్ట్ రేషియో 20:9
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌
వెనకవైపు 3 కెమెరాలు
కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్
2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్,
2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
ముందువైపు 8 మెగాపిక్సెల్
4 జీబీ వరకు ర్యామ్,
64 జీబీ వరకు స్టోరేజ్
మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌ 
10W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్,
 
నోకియా జీ20 స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్ ప్లే
యాస్పెక్ట్ రేషియో కూడా 20:9
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌
10W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్
4 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్

నితిన్, శ్రీలీల రాబిన్‌హుడ్ నుంచి క్వీన్ విద్యా వోక్స్ పాడిన సాంగ్ రిలీజ్

తల్లి మనసు సినిమాకు సెన్సార్ సభ్యుల ప్రశంసలు

అఖిల్ అక్కినేని, జైనాబ్ రావ్‌జీల నిశ్చితార్థం చేశామన్న నాగార్జున

రోటి కపడా రొమాన్స్‌ బాగా లేదంటే సినిమాలకు రిటైర్‌మెంట్‌ : దర్శకుడు విక్రమ్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments