Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచాన్ని భయపెడుతున్న బి.1.617 వేరియంట్..

ప్రపంచాన్ని భయపెడుతున్న  బి.1.617 వేరియంట్..
, బుధవారం, 12 మే 2021 (22:25 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తికి కారణమైన బి.1.617 వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచంలో 44 దేశాల్లో ఆ వేరియంట్ వ్యాప్తి చెందినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 
 
మొదటి వేవ్ తరువాత ఉదాసీనతను ప్రదర్శించడం వలనే భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కరోనా మ్యూటేషన్‌లు ఏర్పడటానికి ఉదాసీనతే కారణమని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలిపింది. 
 
భారత దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ బి.1.617 వేరియంట్ అటు బ్రిటన్‌లోనూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇండియా తరువాత అత్యదిక ఇండియా వేరియంట్ కేసులు అక్కడే నమోదవుతున్నాయి. 
 
బ్రిటన్‌, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాల్లో కనిపించిన వేరియంట్ల కంటే భారత్ వేరియంట్ మరింత వేగంగా విస్తరిస్తుండటంతో ప్రమాదకరమైన వేరియంట్ల జాబితాలో భారత్ వేరియంట్‌ను చేర్చారు.
 
ఇప్పటివరకు 44 దేశాల్లో ఈ రకం వైరస్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం వెల్లడించింది. బి.1.617లో అనేక ఉప రకాలు ఉన్నాయి. ఇది జంట ఉత్పరివర్తనాల వైరస్‌ రకం. ఇప్పటివరకు 44 దేశాలు అప్‌లోడ్‌ చేసిన 4500 నమూనాల్లో ఈ రకాన్ని గుర్తించినట్లు డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
 
ఈ స్ట్రెయిన్‌ వ్యాప్తి సాధారణ కరోనా వైరస్‌తో పోలిస్తే తీవ్రంగా ఉందని, చాలా దేశాల్లో ఈ రకం వల్ల కేసులు వేగంగా పెరిగాయని, అందుకే దీన్ని ఆందోళనకర జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది. ఈ స్ట్రెయిన్‌ మూలంగానే భారత్‌లోనూ కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు పేర్కొంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా అక్కచెల్లమ్మలైన నర్సులందరికీ కృతజ్ఞతలు: సీఎం వైయ‌స్ జగన్ ట్వీట్‌