అమరావతి: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్ధంగా సేవ చేస్తూ ప్రతి వారిని తమ సొంతవారిలా చూసే నర్సులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృతజ్ఙతలు తెలియజేశారు.
ఈ మేరకు ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా ఏపీలో కరోనా మహమ్మారిని ఎదుర్కొంటూ ఎంతో మందికి నిస్వార్ధంగా సేవలందిస్తున్నారు నా అక్క చెల్లమ్మలైన నర్సులు. వారందరికీ మనస్పూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.