Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియా కా స్మార్ట్ ఫోన్... మార్కెట్‌లోకి జియో కొత్త స్మార్ట్ ఫోన్... ధర సస్పెన్స్

అనుకున్నట్టుగానే రిలయన్స్ జియో సరికొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 'ఇండియా కా స్మార్ట్ ఫోన్' పేరుతో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. శుక్రవారం జరిగిన రిల‌యెన్స్ 40వ వార్

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (11:43 IST)
అనుకున్నట్టుగానే రిలయన్స్ జియో సరికొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. 'ఇండియా కా స్మార్ట్ ఫోన్' పేరుతో దీన్ని ప్రవేశపెట్టారు. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. శుక్రవారం జరిగిన రిల‌యెన్స్ 40వ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం సంద‌ర్భంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను ప్రవేశపెట్టింది. 
 
కాగా, ఈ సందర్భంగా ఆ సంస్థ అధినేత ముకేష్ అంబానీ కంట‌త‌డి పెట్టారు. ఈ 40 ఏళ్ల‌లో రిల‌యెన్స్ సాధించిన ప్ర‌గ‌తిని చెబుతుండగా ఆయన కంటతడిపెట్టారు. అలాగే, ప్రేక్ష‌కుల్లో ఉన్న ఆయ‌న త‌ల్లి కూడా విల‌పించారు. 1977లో వస్త్ర‌వ్యాపారం నుంచి ఇప్పుడు ఎన్నో రంగాల్లోకి విస్త‌రించిన‌ట్లు అంబానీ చెప్పారు. 
 
ప్ర‌స్తుతం రిల‌యెన్స్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.5 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింద‌ని ఆయ‌న వెల్ల‌డించారు. 1977లో రూ.3 కోట్లుగా ఉన్న సంస్థ ట‌ర్నోవ‌ర్ ప‌ది వేల రెట్లు పెరిగి రూ.30 వేల కోట్ల‌కు చేరింద‌ని తెలిపారు. 3500 ఉన్న ఉద్యోగులు రెండున్న‌ర ల‌క్ష‌ల‌కు చేరార‌ని చెప్పారు. ఇక వెయ్యి ఉన్న షేరు ధ‌ర రూ. 16.5 ల‌క్ష‌ల‌కు చేరింద‌ని ఆయ‌న తెలిపారు. ప్రతి ఒక్క నిమిషానికి ఏడుగురు కష్టమర్లు జియో కుటుంబంలో చేరుతున్నట్టు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అప్పుడు డిస్సాపాయింట్ అయ్యాను, సలహాలు ఇవ్వడం ఇష్టం వుండదు : శ్రీను వైట్ల

కృష్ణుడికి భక్తుడికి మధ్య నడిచే కథే డియర్ కృష్ణ : పి.ఎన్. బలరామ్

ఫీలింగ్స్ చాలా కష్టమైన పాట... కానీ ఎంజాయ్ చేశా : రష్మిక మందన్నా (Video)

సారంగపాణి ప్రేమ జాతకం తెలిపే సంచారి సంచారి సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments