జియోమీ నుంచి మీ 5 ఎక్స్.. 24 గంటల్లోనే 200,000 ఫోన్లు సేల్
జియోమీ నుంచి భారత మార్కెట్లోకి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. చైనాకు చెందిన చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ అయిన జియోమీ నుంచి మీ 4, మీ5 పేర్లతో కొత్త ఫోన్లు రిలీజ్ చేసింది. ఈ ఫోన్లు ఈ-కామర్స్
జియోమీ నుంచి భారత మార్కెట్లోకి రెండు స్మార్ట్ ఫోన్లు విడుదలయ్యాయి. చైనాకు చెందిన చెందిన ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ అయిన జియోమీ నుంచి మీ 4, మీ5 పేర్లతో కొత్త ఫోన్లు రిలీజ్ చేసింది. ఈ ఫోన్లు ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్ కార్ట్ ద్వారా వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఇక ఐవూమీ మీ4లో 4.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. మీ5లో 5 అంగుళాల 2.5డీ కర్వ్‌డ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది.
రెండు ఫోన్లలోనూ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఓఎస్‌ను ఉపయోగించారు. జూలై 26వ తేదీన మార్కెట్లలో విరివిగా లభించే ఈ ఫోన్లు ఇ-కామర్స్ సైట్లలో భారీ స్థాయిలో రిజిస్టర్ అయ్యాయి. తొలి సేల్ 24 గంటల్లోనే 200,000 దాటింది.
ఫీచర్స్ సంగతికి వస్తే..
మీ4లో 1జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 64 జీబీ వరకు పెంచుకునే సదుపాయం, ముందు, వెనక 5 ఎంపీ కెమెరాలు ఉన్నాయి.
మీ5లో 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 128 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు, వెనక 8 ఎంపీ, ముందు 5 ఎంపీ కెమెరా ఉన్నాయి.