Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియోను ర్యాగింగ్ చేస్తున్నాయ్.. తట్టుకోలేక పోతున్నాం.. ముఖేష్ అంబానీ

టెలికాం మార్కెట్లో ఎప్పటినుంచో పాతుకునిపోయి ఉన్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు కొత్తగా వచ్చిన తమ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు ఇంటర్కనెక్షన్ ఇవ్వకుండా ర్యాగింగ్‌ చేస్తున్న

Webdunia
మంగళవారం, 18 అక్టోబరు 2016 (14:05 IST)
టెలికాం మార్కెట్లో ఎప్పటినుంచో పాతుకునిపోయి ఉన్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ కంపెనీలు కొత్తగా వచ్చిన తమ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు ఇంటర్కనెక్షన్ ఇవ్వకుండా ర్యాగింగ్‌ చేస్తున్నాయనీ, ఈ వేధింపులను తట్టుకోలేకపోతున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ వ్యాఖ్యానించారు. 
 
సీనియర్ జర్నలిస్టులు శేఖర్ గుప్తా, బర్కాదత్ ఏర్పాటుచేసిన 'ఆఫ్ ది కఫ్' షోలో ఆయన మాట్లాడుతూ... దేశ టెలికాం రంగంలోకి గత నెలలో అడుగుపెట్టిన జియో టెలికాం సేవలు... మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ కంపెనీలో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్పై ఇతర టెలికాం కంపెనీలు ర్యాగింగ్కు పాల్పడుతున్నాయట. 
 
ఈ ర్యాగింగ్ ఆగడాలను తాను గమనిస్తున్నానని, వెంటనే ర్యాగింగ్ను నిలిపివేయాలని లేకుండా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా, తమ కొత్త టెలికాం వెంచర్ లక్ష్యం రూ.1,50,000 కోట్లు కాదని, రూ.2,50,000 కోట్లకు తాము కట్టుబడి ఉన్నామన్నారు. శక్తివంతమైన ఆలోచనలతో ప్రపంచాన్నే మార్చేస్తామన్నారు. 
 
ఇకపోతే.. జియో బోర్డు సభ్యులందరూ తనకు వెన్నంటే ఉంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. జియో అద్భుత సృష్టికి దోహదం చేసిన తన పిల్లలు, ప్రస్తుతం జియో బోర్డు డైరెక్టర్లు ఇషా అంబానీ, ఆకాశ్‌లను మరోసారి మెచ్చుకున్నారు. భారత్లో పాకిస్తాన్ యాక్టర్ల నిషేధంపై స్పందించిన అంబానీ, భారతీయులకు మొదట దేశమే ముఖ్యమన్నారు. తర్వాతే కళలు, సంస్కృతి అన్నారు.. పాకిస్థానీ యాక్టర్లను భారత్లో నిషేధించడాన్ని ఆయన మద్దతుపలికారు.  

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments