మార్కెట్లోకి మోటోరోలా వన్ పవర్ ఫోన్... ప్రత్యేకతలు ఏంటి?

మొబైల్ ఫోన్ దిగ్గజం మోటోరోలా సంస్థ సరికొత్త ఫోన్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. అదే మోటోరోలా వన్ పవర్. ఈ మోడల్ ధరను భారత్‌లో రూ. 15999గా నిర్ణయించింది. సెప్టెంబర్ 25వ తేదీన సంస్థ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ మొట్టమొదటి ఆండ్రాయిడ్ వన

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (15:32 IST)
మొబైల్ ఫోన్ దిగ్గజం మోటోరోలా సంస్థ సరికొత్త ఫోన్‌ని మార్కెట్‌లోకి విడుదల చేసింది. అదే మోటోరోలా వన్ పవర్. ఈ మోడల్ ధరను భారత్‌లో రూ. 15999గా నిర్ణయించింది. సెప్టెంబర్ 25వ తేదీన సంస్థ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ మొట్టమొదటి ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌గా మోటరోలా వన్ పవర్‌ని తీసుకొచ్చింది. అంతేకాకుండా భారత్ కోసం ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. 
 
ఈ ఫోన్ ప్రత్యేకంగా ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి రానుంది. ఇది ఆండ్రాయిడ్ 9 పై వెర్షన్‌తో పనిచేసే మొట్టమొదటి ఫోన్. మెటల్ డిజైన్‌ని కలిగి ఉండటంతో పాటు వెనుకన మోటోరోలా లోగోతో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇది కలిగి ఉంటుంది. వైడ్‌వైన్ L1 DRM సపోర్ట్ చేయడమే కాకుండా నెట్‌ఫ్లిక్స్‌ని హెచ్‌డిలో సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కొనుగోళ్ల రిజిస్ట్రేషన్‌లు ఈరోజు ప్రారంభమయ్యాయి. స్మార్ట్‌ఫోన్ అక్టోబర్ 15వ తేదీ అందుబాటులోకి వస్తుంది.
 
మోటోరోలా వన్ పవర్ ప్రత్యేకతలు:
1) మోటోరోలా వన్ పవర్ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 636 చిప్‌సెట్ మరియు అడ్రెనో 509 జిపియు ఆధారితమైనది.
2) 6.2 అంగుళాల డిస్‌ప్లేతో 19:9 స్క్రీన్ మరియు 450 నిట్స్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది.
3) 5000mAh బ్యాటరీ.
4) 16 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, అలాగే 5-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో పాటు 12 మెగాపిక్సెల్‌ల సెన్సార్ ఫ్రంట్ కెమెరా.
5) 4K వీడియో రికార్డింగ్ సౌలభ్యం కలదు.
6) 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నెల్ స్టోరేజీని కలిగి ఉంటుంది.
7) ఇందులో రెండు సిమ్ కార్డ్ స్లాట్‌లు మరియు ఒక SD కార్డ్ స్లాట్ ఉంటుంది.
8) 15 నిమిషాల ఛార్జింగ్‌తో ఏకంగా 6 గంటల బ్యాటరీ స్టాండ్‌బై కలిగి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శంబాల లో నాకు అద్భుతమైన పాత్ర దక్కింది, నటుడిగా గుర్తింపునిచ్చింది : శివకార్తిక్

మర్దానీ 3 ట్రైలర్ నన్ను కదిలించిందన్న హర్మన్‌ ప్రీత్ కౌర్

మగాడిపై సానుభూతి కలిగించేలా పురుష: నుంచి కీరవాణి పాట

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న చిత్రం వీడీ 14 టైటిల్ ప్రకటన

స్వయంభు కోసం టాప్ విఎఫ్ఎక్స్ కంపెనీలు ముందుకు వచ్చాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుంది?

సెకండరీ గ్లకోమాకు విస్తృతమైన స్టెరాయిడ్ వాడకం కారణం: వైద్యులు

బొప్పాయి తింటే లాభాలతో పాటు నష్టాలు కూడా వున్నాయి, ఏంటవి?

ఈ సీజన్‌లో వింటర్ ఫ్లూ, న్యుమోనియాను దూరంగా ఉంచడానికి 5 ముఖ్యమైన చిట్కాలు

సెయింట్ లూయిస్‌లో నాట్స్ ఉచిత వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments