Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోటోరోలా మోటో జీ5జీ స్మార్ట్ ఫోన్‌.. ఫ్లిఫ్ కార్ట్‌లో సేల్ ప్రారంభం

Webdunia
సోమవారం, 7 డిశెంబరు 2020 (20:46 IST)
మనదేశంలో మోటోరోలా మోటో జీ5జీ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ కూడా లభించనుంది. 
 
ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతో 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలు ఉన్నాయి. 
 
5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు. ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. వొల్కానిక్ గ్రే, ఫ్రాస్టెడ్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ డిస్ ప్లేను అందించనున్నారు. 
 
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై మోటో జీ 5జీ పనిచేయనుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లు అర్జున్ ను పవన్ కళ్యాణ్ కలిశాడా? ఎందుకు మౌనంగా వున్నాడు?

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ కంటెంట్ చాలా కొత్తగా వుంది. డైరెక్టర్ బాబీ కొల్లి

హీరో సిద్ధార్థ్ పాడిన 'నా శ్వాసే నువ్వై..' లిరికల్ సాంగ్ రిలీజ్

దిల్ రూబా షూటింగ్ కంప్లీట్, ఫిబ్రవరిలో రిలీజ్ కు రెడీ

కొన్ని రోజులు థియేటర్స్ లో వర్క్ చేశా, అక్కడే బీజం పడింది : హీరో ధర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Worst Foods for Diabetes షుగర్ ఉన్నవాళ్లు ఏం తినకూడదు?

Palmyra Sprout తేగలు తింటే ఏమవుతుంది?

ఏ పాత్రల్లోని వంట ఆరోగ్యానికి మంచిది? ఏవి మంచివి కావు?

రాగి పాత్రలో మంచినీటిని తాగితే 7 ఫలితాలు

హైదరాబాద్ లోని నాగోల్‌లో రిలయన్స్ రిటైల్ ‘యూస్టా’ సరికొత్త స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments