పిచాయ్ తర్వాత ఆ 21 ఏళ్ల కుర్రాడేనా? తన్నుకుంటున్న గూగుల్-ఫేస్‌బుక్?

ఇక్కడ కనబడుతున్న మైఖేల్ సేమాన్ అనే 21 ఏళ్ల యువకుడి కోసం గూగుల్-ఫేస్ బుక్ రెండూ తన్నుకుంటున్నాయి. అంటే... అతడి కోసం పోటీపడుతున్నాయి. ఇతడిని 17 ఏళ్ల వయసున్నప్పుడు ఫేస్ బుక్ ఇంటర్నిషిప్ పేరుతో ఉద్యోగంలోకి తీసుకుంది. ఆ తర్వాత అతడికి 18 ఏళ్లు నిండటంతో ఫుల

Webdunia
బుధవారం, 30 ఆగస్టు 2017 (15:22 IST)
ఇక్కడ కనబడుతున్న మైఖేల్ సేమాన్ అనే 21 ఏళ్ల యువకుడి కోసం గూగుల్-ఫేస్ బుక్ రెండూ తన్నుకుంటున్నాయి. అంటే... అతడి కోసం పోటీపడుతున్నాయి. ఇతడిని 17 ఏళ్ల వయసున్నప్పుడు ఫేస్ బుక్ ఇంటర్నిషిప్ పేరుతో ఉద్యోగంలోకి తీసుకుంది. ఆ తర్వాత అతడికి 18 ఏళ్లు నిండటంతో ఫుల్ టైమ్ ఇంజినీరింగ్ ఉద్యోగంలో కూర్చోబెట్టింది. 21 ఏళ్లు నిండగానే అతగాడు కాస్తా ఫేస్‌బుక్‌కు కట్ కొట్టి గూగుల్ కంపెనీకి జంప్ అయ్యాడు. ఐతే అతడి కోసం ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడట.
 
కాగా గూగుల్ కంపెనీలో పనిచేస్తున్న ప్రొడక్షన్ మేనేజర్లలో సేమాన్ అత్యంత పిన్నవయస్కుడు. ప్రస్తుతం ఇతడు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో వాయిస్ డేటా బేస్ సర్వీస్ కోసం పనిచేస్తున్నాడు. ఇతడి టెక్నికల్ స్కిల్స్ చూసినవారు సుందర్ పిచాయ్ తర్వాతి స్థానం అతడిదే అంటున్నారు. 
 
ఇదిలావుంటే ఫేస్ బుక్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సేమాన్ ‘లైఫ్‌స్టేజ్’ యాప్ క్రియేట్ చేశాడు. ఇది 21 అంతకంటే తక్కువ వయసున్న వారిని ఉద్దేశించి గతేడాది అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్ ద్వారా ప్రైవేటు మెసేజ్‌లను నేరుగా పంపించడం కాకుండా సెల్ఫీలు, వీడియోలను క్లాస్‌మేట్లకు షేర్ చేసుకోవచ్చు. 
 
కానీ ప్రైవసీ సమస్యలు ఎక్కువగా వుండటంతో దీనిని వాడేందుకు ఎవరూ ఉత్సాహం చూపించలేదు. దాంతో ఈ యాప్‌ను ఈ నెల 4న తన యాప్ స్టోర్ నుంచి ఫేస్ బుక్ తొలగించింది. కానీ సేమాన్ సృష్టించిన మరికొన్ని యాప్‌లు అద్భుతాలను సృష్టిస్తాయని చెప్పుకుంటున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

శ్రీదేవి అపల్లా, ఫెమినా జార్జ్, విజయ్ బుల్గానిన్ కాంబోలో ద్విభాషా చిత్రం

Rajamouli: రాజమౌళి, మహేష్ బాబు చిత్రం వారణాసి ఒక్క పార్ట్ నా?

అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్ ల మై డియర్ సిస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments