Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఐటీ మంత్రి ట్విట్టర్ అకౌంట్‌నే హ్యాక్ చేశారు.. అశ్లీల చిత్రాలు కనిపించడంతో..?

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (16:22 IST)
ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విట్టర్‌ అకౌంట్‌లో అశ్లీల చిత్రాలు కనిపించడం కలకలం రేపింది. మంత్రి అకౌంట్‌లో ఆ చిత్రాలు చూసి అంతా షాక్ అయ్యారు. విషయం తెలిశాక మంత్రి కూడా కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే.. మంత్రి గారి అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. 
 
హ్యాకర్లు అందులో అశ్లీల చిత్రాలను పోస్ట్‌ చేశారు. వీటిని ఆలస్యంగా గుర్తించిన మంత్రి వాటిని వెంటనే తొలగించారు. దీనిపై ట్విటర్‌ సంస్థకు, సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, తన ట్విట్టర్‌ ఖాతాను ఫాలో అవుతున్న వారందరికీ మంత్రి క్షమాపణలు చెప్పారు.
 
ఇదే విషయాన్ని ఆయన మరో పోస్ట్ పెట్టి అందరికీ తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, అసంబద్ధమైన పోస్టులు పెడుతున్నారని, కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను అని ట్వీట్ చేశారు. తన ఖాతాలో చెత్త పోస్టులను పట్టించుకోకూడదని ఫాలోవర్స్‌కు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి మేకపాటి. 
 
కాగా, తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్న మేకపాటి గౌతమ్ రెడ్డికి.. ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం కాస్త ఇబ్బందికర పరిణామం. ఏకంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కి గురవడం హాట్ టాపిక్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments