Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫేస్‌బుక్ ఖాతాదారులకు క్షమాపణలు చెప్చిన జుకర్ బర్గ్... ఎందుకు?

పేస్‌బుక్ ఖాతాదారులకు ఆ సంస్థ సీఈవో జుకర్ బర్గ్ క్షమాపణలు చెప్పారు. కోట్లాది మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమైందంటూ ప్రముఖ సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌పై గత కొన్ని రోజులుగా ఆరోపణలు

Webdunia
గురువారం, 22 మార్చి 2018 (14:12 IST)
పేస్‌బుక్ ఖాతాదారులకు ఆ సంస్థ సీఈవో జుకర్ బర్గ్ క్షమాపణలు చెప్పారు. కోట్లాది మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమైందంటూ ప్రముఖ సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌పై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఆరోపణలపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఎట్టకేలకు స్పందించారు. యూజర్ల సమాచారాన్ని రహస్యంగా ఉంచడంలో కంపెనీ నుంచి పొరబాటు జరిగిందని జుకర్‌బర్గ్‌ అంగీకరించారు. అయితే తమ పొరబాటును సరిదిద్దుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లీ జరగకుండా డెవలరపర్లు, బిజినెస్‌ భాగస్వాములతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో‌ సుదీర్ఘ పోస్టు పెట్టారు. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా.. ఐదు కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ విషయమై అమెరికాలోని శాన్‌జోస్‌ కోర్టులో కేసు కూడా నమోదైంది. మరోవైపు ఈ వ్యవహారం విషయంలో భారత్‌ కూడా ఫేస్‌బుక్‌ను గట్టిగా హెచ్చరించింది. భారత ఎన్నికల ప్రక్రియల్లో అక్రమ మార్గాల ద్వారా జోక్యం చేసుకుంటే సహించేది లేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ హెచ్చరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments