Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎల్జీ నుంచి రోలింగ్ ల్యాప్ టాప్.. స్క్రీన్‌ను ఏకంగా చుట్టేసేలా..?

Webdunia
మంగళవారం, 24 నవంబరు 2020 (19:18 IST)
Laptop
ఎల్జీ నుంచి ఇప్పటికే రోలింగ్ మొబైల్స్ వచ్చేందుకు రంగం సిద్ధం అవుతోంది. స్క్రీన్‌ను ఏకంగా చుట్టేసేలా ఈ మొబైల్స్‌ ఉండనున్నాయి. ఈ పోటీలో ఇప్పుడు ల్యాప్‌టాప్‌లు కూడా ముందుకొస్తున్నాయి. అది కూడా ఎల్‌జీ నుంచే. ఈ మేరకు పేటెంట్‌ ఇమేజెస్‌ కొన్ని ఆన్‌లైన్‌ చక్కర్లు కొడుతున్నాయి. శాంసంగ్, మోటోరోలా, హువావే ఇప్పటికే ఫోల్డింగ్ మోడల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేశాయి. 
 
ఎల్‌జీ త్వరలోనే 17-అంగుళాల రోలింగ్ డిస్‌ప్లేతో ల్యాప్‌టాప్‌ తీసుకురానుందట. ఈ మేరకు రూట్‌ మై గెలాక్సీ పేరుతో రోలింగ్ ల్యాప్‌టాప్‌ డిజైన్‌కు సంబంధించిన హక్కులను ఇటీవలే పొందినట్లు టెక్‌ వర్గాలు తెలిపాయి. రోలింగ్ ల్యాప్‌టాప్‌ డిస్‌ప్లేని 13.3 అంగుళాల నుంచి 17 అంగుళాల సైజు వరకు ఉపయోగించుకోవచ్చు. 
 
అలానే ల్యాప్‌టాప్‌ కీబోర్డు కూడా మడతపెట్టేయొచ్చు. ఇప్పటికే ఎల్‌జీ వింగ్, జీ8 ఎక్స్‌ థింక్యూ పేరుతో డ్యూయల్ స్క్రీన్‌ మొబైల్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. త్వరలోనే దీనిపై ఎల్‌జీ నుంచి రోలింగ్‌ ల్యాప్‌టాప్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.  

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments