Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్ - కాపీ - పేస్ట్ సృష్టికర్త ఇకలేరు...

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (19:05 IST)
కట్, కాపీ, పేస్ట్ ఈ పదాలు కంప్యూటర్ వినియోగించే వారికి బాగా సుపరిచితం. ఈ పదాల సృష్టికర్త ఇపుడు లేరు. ఆయన పేరు లారీ టెస్లర్. వయసు 74 యేళ్లు. కట్, కాపీ, పేస్ట్ పదాలను కనిపెట్టడంలోనే కాకుండా, కంప్యూటర్ అభివృద్ధిలో ఈయన కృషి ఎంతోదాగివుంది. 
 
1960 ద‌శకంలో కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలో ప‌నిచేసిన టెస్ల‌ర్‌.. సులువైన కంప్యూట‌ర్ క‌మాండ్లను రూపొందించారు. కంప్యూట‌ర్ల విజ్ఞానాన్ని సుల‌భ‌త‌రం చేసిన క‌ట్‌, కాపీ, పేస్ట్ లాంటి క‌మాండ్ల‌ను ఈయ‌నే క‌నుగొన్నారు. ఈయన మృతి వార్త కంప్యూటర్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లారీ టెస్ల‌ర్ మృతి ప‌ట్ల జిరాక్స్ కంపెనీ నివాళి అర్పించింది. 
 
1945లో న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌లో జన్మించిన టెస్ల‌ర్‌.. కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫ‌ర్డ్ వ‌ర్సిటీలో చ‌దివారు. గ్రాడ్యుయేష‌న్ త‌ర్వాత టెస్ల‌ర్‌.. ఇంట‌ర్‌ఫేస్ డిజైన్‌పై దృష్టి పెట్టారు. దీంతో ఆయన కంప్యూట‌ర్ల వినియోగాన్ని యూజ‌ర్ ఫ్రెండ్లీగా మార్చేశారు. జిరాక్స్ కంపెనీతో పాటు స్టీవ్ జాబ్స్‌తో క‌లిసి యాపిల్ సంస్థ‌లో టెస్ల‌ర్ ప‌నిచేసి ఎన్నో అద్భుతాలను సృష్టించారు. 
 
ఈయన తన కెరీర్‌ను తొలుత జిరాక్స్ పలో అల్టో రీసెర్స్ సెంటర్‌లో సుధీర్ఘకాలం పాటు పని చేశారు. దీనితర్వాత యాపిల్ కంపెనీ యాజమాన్యం ఈయన్ను సంప్రదించింది. ఇక్కడ ఈయన 17 యేళ్ళ పాటు పని చేశాడు. ఆ తర్వాత కంప్యూటర్ విభాగంలో చీఫ్ సైంటిస్టుగా అవతరించాడు. 
 
యాపిల్ నుంచి తప్పుకున్న తర్వాత పలు ఎడ్యుకేష్ స్టార్టప్ సెంటర్లను ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత అమెజాన్, యాహూ వంటి సంస్థల్లో కొంతకాలం పని చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాకు నేనే మహారాజ్ ను అందుకే డాకు మహరాజ్ పెట్టాం : నందమూరి బాలకృష్ణ

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments