Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో యూజర్లకు గుడ్‌న్యూస్... 4జీ ఫీచర్ ఫోన్‌లో వాట్సాప్!

రిలయన్స్ జియో 4జీ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొనుగోలుదార్లకు నిజంగా ఇది గుడ్‌న్యూసే. ఈ సంస్థ విడుదల చేయనున్న 4జీ ఫీచర్ ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి కోసం ప్రత్యేక యాప్‌ను అ

Webdunia
ఆదివారం, 6 ఆగస్టు 2017 (12:37 IST)
రిలయన్స్ జియో 4జీ ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న కొనుగోలుదార్లకు నిజంగా ఇది గుడ్‌న్యూసే. ఈ సంస్థ విడుదల చేయనున్న 4జీ ఫీచర్ ఫోన్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకుని రానుందనే వార్తలు వస్తున్నాయి. 
 
నిజానికి ఈనెలాఖరులో జియో 4జీ ప్రీ బుకింగ్స్ ప్రారంభంకానున్నాయి. సెప్టెంబర్ నెలలో యూజర్లకు ఈ ఫోన్లు లభించనున్నాయి. అయితే జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో ఫేస్‌బుక్, యూట్యూబ్ తప్ప మిగిలిన సోషల్ యాప్స్ ఏవీ పనిచేయవనే ప్రచారం ఉంది. వాట్సాప్ ఈ ఫోన్‌లో రాదని జియో వర్గాలు స్పష్టత ఇచ్చాయి కూడా. 
 
అయితే దీనిపై చాలా మంది యూజర్లు పెదవి విరిచారు. జియో 4జీ ఫీచర్ ఫోన్‌లో వాట్సాప్ రాదనే విషయం తెలిశాక చాలా మంది ఈ ఫోన్‌ను కొనేందుకు నిరాసక్తతను ప్రదర్శించినట్టు తెలిసింది. దీంతో జియో వాట్సాప్‌ను ఎలాగైనా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. 
 
అందులో భాగంగానే ప్రస్తుతం జియో ప్రతినిధులు వాట్సాప్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిసింది. జియో 4జీ ఫీచర్ ఫోన్ కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ వెర్షన్‌ను క్రియేట్ చేసేందుకుగాను జియో వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రెండు కంపెనీల ప్రతినిధులు ఈ విషయంపై చర్చిస్తున్నట్టు తెలిసింది. ఈ చర్చలు ఫలిస్తే ఈ ఫోన్‌లో వాట్సాప్ సౌకర్యాన్ని అందుబాటులోకి రానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments