బ్లూవేల్ ఆన్ లైన్ గేమ్ ఆడుతూ.. నాలుగో అంతస్తు నుంచి దూకేశాడు..
బ్లూవేల్ అనే ఆన్ లైన్ వీడియో గేమ్ ఓ బాలుడి ఆత్మహత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని అంధేరీ ప్రాంతానికి చెందిన బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇతను శనివారం ‘బ్లూవేల్’ అనే ఆన్‌లైన్
బ్లూవేల్ అనే ఆన్ లైన్ వీడియో గేమ్ ఓ బాలుడి ఆత్మహత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే.. ముంబయిలోని అంధేరీ ప్రాంతానికి చెందిన బాలుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇతను శనివారం ‘బ్లూవేల్’ అనే ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ కూర్చున్నాడు. అండర్‌గ్రౌండ్ ఆన్‌లైన్ గేమ్‌లో 50 టాస్క్‌లు ఉంటాయి. ప్రతీ టాస్క్‌ని పూర్తిచేస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు తీసి పోస్ట్ చేస్తుండాలి.
అలా బాలుడు ఈ గేమ్ ఆడుతుండగా భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ఓ టాస్క్‌లో చెప్పడంతో.. కొంచెం కూడా ఆలోచించకుండా ఆ బాలుడు నాలుగు అంతస్తుల నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలకు గురైన ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.