Webdunia - Bharat's app for daily news and videos

Install App

4జీ డౌన్‌లోడ్ వేగంలో జియో టాప్.. ట్రేడింగ్‌లోనూ అదుర్స్

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (12:10 IST)
ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్‌ జియో తాజాగా జూన్‌లో 4జీ డౌన్‌లోడ్‌ వేగంలో అగ్రస్థానంలో నిలిచింది. జియో నెట్‌వర్క్‌పై 4జీ డౌన్‌లోడ్‌ సగటు వేగం 16.5 ఎంబీపీఎస్‌గా నమోదైనట్లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా( ట్రాయ్‌) గణాంకాలు తెలిపాయి. వొడాఫోన్‌ ఐడియా అప్‌లోడ్‌ స్పీడ్‌లో 6.2 ఎంబీపీఎస్‌తో అగ్రస్థానంలో నిలిచాయి.
 
డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియో తర్వాత ఐడియా 8 ఎంబీపీఎస్‌, వొడాఫోన్‌ 7.5 ఎంబీపీఎస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ 7.2 ఎంబీపీఎస్‌ సగటు వేగాన్ని నమోదు చేశాయి. అప్‌లోడ్ వేగంలో వొడాఫోన్ ఐడియా తర్వాత జియో, ఎయిర్‌టెల్‌ 3.4 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
 
మరోవైపు ఆర్‌ఐఎల్‌ సరికొత్త రికార్డ్‌‌ను నమోదు చేసుకుంది. పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ ఆర్‌ఐఎల్‌ షేరు మరోసారి చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఈ బాటలో గురువారం భారీ లాభాలతో లిస్టయిన స్పెషాలిటీ కెమికల్స్‌ కంపెనీ రోజారీ బయోటెక్‌ వరుసగా రెండో రోజూ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. శుక్రవారం నాటి ట్రేడింగ్‌లో ఎన్‌ఎస్‌ఈలో తొలుత ఆర్‌ఐఎల్‌ షేరు రూ. 2150కు చేరింది. 
 
ఇది ఆల్‌టైమ్‌ హై.. కాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 2120 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో కంపెనీ మార్కెట్‌ క్యాప్ ‌(విలువ) రూ. 14 లక్షల కోట్లను తాకడం గమనార్హం. గత నెల రోజుల్లో ఆర్‌ఐఎల్‌ షేరు 22 శాతం లాభపడిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments