Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేటి నుండి జియో టీవిలో టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు

నేటి నుండి జియో టీవిలో టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలు
, బుధవారం, 22 జులై 2020 (21:29 IST)
విద్యార్థులకు ఆన్‌లైన్ ప్రసారాలు అందించడంలో ముందు వరసలో ఉన్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు మరో ముందడుగు వేశాయి. ప్రయివేటు కమ్యునికేషన్ రంగంలో అగ్రగామి సంస్థ అయిన జియో టీవి యాప్ ద్వార ఉచితంగా టి-సాట్ ప్రసారాలు అందించేందుకు టి-సాట్ నెట్వర్క్ సిద్ధమైంది. ఈ మేరకు టి-సాట్, జియో టీవి నెట్కర్క్ విభాగాలు గురువారం నుండి ప్రసారాలు అందించాలని నిర్ణయించాయి.
 
కరోనా ప్రభావం కారణంగా ఇబ్బందులెదుర్కొంటున్న విద్యారంగానికి ఆన్‌లైన్ ప్రసారాలు అందిస్తున్న టి-సాట్ విద్య, నిపుణ ఛానళ్ల ప్రసారాలకు జియో టీవి యాప్ ద్వార మరింత వెసులుబాటు కలుగనుంది. ఇప్పటికే 24 గంటల ప్రసారాలతో నాలుగు లక్షల సబ్ స్క్రైబ్స్ కలిగి ఉన్న టి-సాట్ యాప్ తెలంగాణలోని 1.59 కోట్ల జీయో ఖాతాదారులకూ ప్రసారాలు అందనున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న 40 కోట్ల జియో ఖాతాదారులకు టి-సాట్ ప్రసారాలు ఉచితంగా చేరతాయి.
 
జియో సంస్థ దేశ వ్యాప్తంగా ప్రసారం చేసే 700 ఛానళ్లలో 64 ఛానళ్లు విద్యకు సంబంధించినవి ఉండగా వాటి చెంతకు టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు చేరాయి. ఈ ప్రసారాలు వారం రోజుల పాటు జియో యాప్‌లో అందుబాటులో ఉండటం విద్యార్థులకు మరో అదనపు అవకాశంగా భావించాలి. పాఠశాల విద్యతో పాటు ఉన్నత స్థాయి, సాంకేతిక విద్యకు సంబంధించిన ప్రసారాలు, పోటీ పరీక్షలు, వృత్తి నైపుణ్య ప్రసారాలు, జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలకు నాణ్యమైన సమాచారాన్ని అందిస్తూ సేవలందిస్తున్న టి-సాట్‌కు జియో టీవి నెట్వర్క్ తోడవడం సంతోషించాల్సిన విషయమని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి బుధవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
 
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో పేద, మారుమూల ప్రాంత విద్యార్థులకు సేవలందించే లక్ష్యంతో నిర్వహిస్తున్న టి-సాట్ నిపుణ, విద్య ఛానళ్లకు జియో టీవి నెట్వర్క్ తోడవటం విద్యార్థి రంగంతో పాటు ఇతర రంగాలకు భారీ ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
జియో టీవి తెలంగాణ సీఈవో కె.సి.రెడ్డి తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల ప్రసారాలను మా జియో టీవి ద్వార అందించడం మాకూ గర్వంగా ఉందన్నారు. టి-సాట్ ప్రసారాలను చూసే అన్ని వర్గాల ప్రజలకు జియో నెట్వర్క్ ద్వార మరింత స్పష్టత, స్వచ్ఛత ఏర్పడనుందన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం సందర్భంగా తెలంగాణ విద్యార్థులకు టి-సాట్ ద్వార సేవ చేసే అవకాశం లభించడం సంతృప్తినిస్తోందని కె.సి.రెడ్డి. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ ప్రభుత్వంపై పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫైర్