ఎయిర్‌టెల్‌కు చెక్.. జియో డబుల్ ధమాకా... రోజూ అదనంగా 1.5జీబీ ఫ్రీ

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియో తాజా మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లపై అదనంగా 1.5జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింద

Webdunia
బుధవారం, 13 జూన్ 2018 (08:21 IST)
దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన రిలయన్స్ జియో తాజా మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. జియో తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లపై అదనంగా 1.5జీబీ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
 
ఈ ఆఫర్ జూన్ 12వ తేదీ నుంచి జూన్‌ 30వ తేదీ వరకు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంటుంది. డబుల్‌ ధమాకా ఆఫర్‌‌తో పాటు, ఈ ఆపరేటర్‌ కొత్తగా రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌‌ను కూడా 3 నెలల వాలిడిటీతో లాంచ్‌ చేసింది. ఈ కొత్త ప్యాక్‌‌పై రోజుకు 3.5జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది.
 
జియో డబుల్‌ ధమాకా ఆఫర్‌ మేరకు.. 
రోజుకు 1.5జీపీ డేటా పొందే రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 3జీబీ డేటా పొందనున్నారు.
రోజుకు 2జీబీ డేటా పొందే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 3.5జీబీ డేటా లభ్యం.
రోజుకు 3జీబీ డేటా పొందే రూ.299 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 4.5జీబీ డేటా వస్తుంది.
రోజుకు 4జీబీ డేటా పొందే రూ.509 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5జీబీ డేటా లభ్యం.
రోజుకు 5జీబీ డేటా పొందే రూ.799 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5జీబీ డేటా పొందనున్నారు.
 
అంతేకాకుండా, 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్‌‌లపై జియో 100 రూపాయల డిస్కౌంట్‌ ఆఫర్‌ చేయనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌‌లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది. అయితే ఈ డిస్కౌంట్‌‌ల కోసం మైజియో యాప్‌, పేటీఎం వాడుతూ.. ఫోన్‌ పే వాలెట్‌ ద్వారానే రీఛార్జ్‌ చేయించుకోవాలని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

గుర్రం పాపిరెడ్డి బోర్ కొట్టదు, అవతార్ రిలీజ్ మాకు పోటీ కాదు : డైరెక్టర్ మురళీ మనోహర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తర్వాతి కథనం
Show comments