జియో నుంచి చౌక 5జి ఫోన్ - త్వరలో విడుదల

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2023 (10:13 IST)
రిలయన్స్ జియో నుంచి చౌక 5జీ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఈ ఫోనుకు ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేట్ వచ్చిందంటూ ప్రచారం. మార్కెట్‌లోకి రెండు కొత్త హ్యాండ్ సెట్లు విడుదల చేయనుంది. ఈ స్మార్ట్ ఫోన్లను చౌక ధరకే విక్రయించనుంది. టెలికాం రంగంలో సంచనలం సృష్టించిన రిలయన్స్ జియో కంపెనీ మరో సంచలనానికి తెరతీయనుంది. త్వరలో 5జీ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయనుందని సమాచారం. 
 
ఈ స్మార్ట్ ఫోనును చౌక ధరకే వినియోగదారులకు అందించేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తుందని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీఐఎస్ సర్టిఫికేట్ లంభించిందని ప్రచారం జరుగుతుంది. రెండు కొత్త హ్యాండ్‌ సెట్‌లకు సంబంధించి కంపెనీ ఉన్నత వర్గాల్లో ఇప్పటికే చర్చలు జరిగాయని, ఈ నెలాఖరులో జరగనున్న కంపెనీ వార్షిక సమావేశానికి ముందే ఈ స్మార్ట్ ఫోన్లను సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. 
 
5జీ స్మార్ట్ ఫోన్లకు సంబంధించి జియో కంపెనీ రెండు రకాల హ్యాండ్‌ సెట్లను తయారు చేసింది. ఈ ఫోన్‌ల మోడల్ నంబర్‌ను జేబీవీ 161 డబ్ల్యూ 1, జేబీవీ 162 డబ్ల్యూ1, అయితే, ఇవి రెండూ 5జీ ఫోన్లనా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. రిలయన్స్ జియో 5జీ ఫోన్లు అంటూ సోషల్ మీడియోలో ఇప్పటికే పలు ప్రచారంలో ఉన్నాయి. 
 
ఈ జియో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్‌లు... 
90 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాలు హెచ్.డి.ప్లస్ స్క్రీన్ 
స్నాప్ డ్రాగన్ 480 చిప్ సెట్ స్పీడ్ 
18 వాట్స్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 
డ్యూయల్ రియల్ కెమెరా సెటప్ 
13 మెగాపిక్సెల్ ప్రైమరీ, 2 మెగాపిక్సెల్ సెకండీ కెమెరా 
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుందని తెలుస్తుంది 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Akhanda 2 Review,అఖండ 2 తాండవం.. హిట్టా. ఫట్టా? అఖండ 2 రివ్యూ

దక్షిణాదిలో జియో హాట్‌స్టార్ రూ.4 వేల కోట్ల భారీ పెట్టుబడి

Peddi: పెద్ది కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం, మార్చి 27న రిలీజ్

Rana: టైం టెంపరరీ సినిమా అనేది ఫరెవర్ : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ శీతాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ చర్మానికి తగిన సంరక్షణను అందించండి

తులసి పొడితో హెయిర్ ప్యాక్ వేసుకుంటే.. జుట్టు నెరవదు.. తెలుసా?

Tomato Soup: శీతాకాలంలో టమోటా సూప్ తీసుకుంటే?

నీలి రంగు శంఖులో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..? మహిళలు శంఖు పువ్వు టీ తాగితే?

రాత్రిపూట ఇవి తింటున్నారా? ఐతే తెలుసుకోవాల్సిందే

తర్వాతి కథనం
Show comments