మీరుండే ఏరియాలో సిగ్నల్ లేదా.. ఏ నెట్‌వర్క్‌ అయినా ఉపయోగించుకోండి..

ఠాగూర్
గురువారం, 30 జనవరి 2025 (11:10 IST)
నగర ప్రాంతాల్లోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సిగ్నల్స్ సరిగా ఉండవు. ఒక చోట జియో సిగ్నల్ బలంగా వస్తే.. మరో చోట ఎయిర్ టెల్, ఇంకో చోట బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ బాగుంటాయి... దాంతో, మిగతా కంపెనీల నెట్ వర్క్ వాడేవారికి ఇంటర్నెట్ స్లోగా వస్తుంటుంది. తద్వారా, ఫోన్ కాల్స్‌లో అంతరాయం ఏర్పడుతూ ఉంటుంది. ఇకపై ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. 
 
కేంద్ర టెలికం శాఖ తాజాగా దీనిపై ప్రకటన జారీ చేసింది. సాధారణంగా విదేశాలకు వెళ్లేవారు... మన దేశంలోని ఫోన్ నంబర్ తోనే విదేశాల్లో కాల్స్ చేసుకోవడానికి, ఇంటర్నెట్ వాడుకోవడానికి 'రోమింగ్' సదుపాయం ఉంటుంది. దీనికి విడిగా భారీ స్థాయిలో చార్జీలు ఉంటాయి. 
 
ఇదే తరహాలో దేశంలోనూ అంతర్గతంగా 'ఇంట్రా సర్కిల్ రోమింగ్ (ఐసీఆర్)' విధానాన్ని టెలికం శాఖ ప్రారంభించింది. దీనిద్వారా జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్... ఇలా ఏ నెట్‌వర్క్ వాడేవారైనా ఇతర నెట్ వర్క్‌ల ద్వారా సిగ్నల్ అందుకుని, 4జీ సర్వీసులను వాడుకోవచ్చు. ప్రస్తుతం ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయం 'డీబీఎన్ టవర్ల' పరిధిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 
 
డీబీఎన్ అంటే 'డిజిటల్ భారత్ నిధి'. దేశంలో టెలికమ్యూనికేషన్ సర్వీసులు అందరికీ సమర్థవంతంగా, నాణ్యమైన రీతిలో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ డీబీఎన్‌ను ప్రారంభించింది. 
 
ప్రస్తుతం ఈ మూడు నెట్ వర్క్‌ల పరిధిలోనే...దేశంలో ప్రస్తుతం ఇంట్రా సర్కిల్ రోమింగ్ సదుపాయం జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌ల మధ్య మాత్రమే అందుబాటులో ఉంది. 
 
ఇప్పటివరకు ఈ మూడు కంపెనీలు ఒకరి వ్యవస్థలను మరొకరు వినియోగించుకోవడానికి ముందుకు వచ్చాయని కేంద్ర టెలికం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. భవిష్యత్తులో మిగతా కంపెనీలు కూడా జతకూడే అవకాశం ఉందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments