Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకున్న జియో: TRAI తాజా నివేదిక

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (22:59 IST)
టెలికాం రెగ్యులేటరీ సంస్థ TRAI విడుదల చేసిన తాజా సబ్‌స్క్రైబర్ డేటా ప్రకారం, మే 2022 నెలకు గాను రిలయన్స్ జియో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 3.27 లక్షల మంది కొత్త చందాదారులను చేర్చుకుంది.

 
ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో రిలయన్స్ జియో అత్యధికంగా 3,27,020 మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లను జోడించింది. ఇదే నెలలో భారతీ ఎయిర్‌టెల్ 71,312 మొబైల్ చందాదారులను చేర్చుకుంది. మరోవైపు ఇదే సమయంలో వోడాఫోన్ ఐడియా 74,808 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL 78,423 మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది.

 
జాతీయంగా, రిలయన్స్ జియో మే నెలలో 31.11 లక్షల వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్‌లను సంపాదించి, భారతీయ టెలికాం మార్కెట్లో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకుంది. ఫలితంగా, దేశవ్యాప్తంగా జియో మొత్తం మొబైల్ కస్టమర్ల సంఖ్య ఇప్పుడు 40.87 కోట్లకు చేరుకుంది. 
 
భారతీ ఎయిర్‌టెల్ దేశవ్యాప్తంగా 10.27 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది, దీనితో సంస్థ మొత్తం మొబైల్ వినియోగదారుల సంఖ్య 36.21 కోట్లకు చేరుకుంది. మరో వైపు, వోడాఫోన్ ఐడియా సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య ఈ నెలలో 7.59 లక్షలు తగ్గి 25.84 కోట్లకు పడిపోయింది. BSNL వినియోగదారుల సంఖ్య కూడా దాదాపు 53.62 లక్షలు తగ్గి 11.28 కోట్లకు పడిపోయింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments