Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీని నట్టేట ముంచాడు.. భార్య ఉన్నా.. పెళ్లి చేసుకుంది.. చివరకు..?

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (10:01 IST)
ఐటి రంగంలో రిక్రూటర్‌గా ఉద్యోగం చేస్తున్న యువతిని పెళ్లి చేసుకుని మోసం చేసిన కేసు జూబ్లిహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో నమోదైంది. వివరాల్లోకి వెళితే.. నగరానికి చెందిన సందీప్ ప్రసాద్‌కు అయిదు సంవత్సరాల క్రితమే పెళ్లి అయి ఓ కొడుకు కూడా ఉన్నాడు.
 
అయితే పెళ్లైన అయిదు సంవత్సరాల తర్వాత ఐటి రంగంలో పనిచేసే ఓ యువతితో తాను చిన్నప్పటి నుండి తనను ప్రేమిస్తున్నానని ,పెళ్లి చేసుకుంటానని ,అనంతరం మొదటి భార్యకు విడాకులు ఇస్తానని వెంటబడ్డాడు. కాని యువతి అంగీకరించకపోవడంతో పాటు ఆమె కుటుంబ సభ్యులతో బెదింపులకు దిగింది. 
 
అయినా సందీప్ వినకుండా వెంటపడి మరి ప్రేమ పేరుతో వేధించాడు..పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోతానని బెదిరించాడు. దీంతో సందీప్ మాటలకు లొంగిపోయిన ఐటి ఉద్యోగిని గత జనవరిలో తన కుటుంబ సభ్యులు తల్లిదండ్రులకు తెలియకుండా యాదగిరి గుట్టవద్ద పెళ్లి చేసుకుంది.
 
కాగా పెళ్లి అయిన తర్వాత బెంగళూరుకు వెళదామంటూ.. ఆమెను అక్కడికి రావాలని ఒత్తిడి పెంచాడు. అయితే ఇందుకు యువతి అంగీకరించకపోవడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. చెప్పినట్టు వినకపోతే పెళ్లి ఫోటోలను ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని హెచ్చరించాడు. 
 
అయితే ఐటి యువతి కూడా ఇందుకు అంగీకరించినా.. ముందుగా తన అత్తగారింటికి తీసుకువెళ్లాలని డిమాండ్ చేసింది. దీంతో తల్లిదండ్రులు అంగీకరించడం లేదంటూ... కొంతకాలం నగరంలోని కుషాయిగూడ ఇల్లును అద్దెకు తీసుకుని ఇద్దరు కలిసి ఉన్నారు.
 
మరోవైపు సందీప్ కుటుంబ సభ్యులు కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. మరోవైపు సందీప్ మొదటి భార్యకు విషయం తెలియడంతో కేసు నమోదు చేసింది. దీంతో ఈమె ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నట్టు చెప్పాలని ఆమెపై ఒత్తిడి పెంచారు. ఇందుకు అంగీకరించని యువతి చివరకు యూసఫ్‌గూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ పోతినేని, భాగ్యశ్రీబోర్స్‌ మధ్య కెమిస్ట్రీ హైలైట్ అంటున్న చిత్ర యూనిట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments