Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రమాదకారిగా మారిన డెల్టా వేరియంట్ ... 85 దేశాలకు వ్యాప్తి

Advertiesment
ప్రమాదకారిగా మారిన డెల్టా వేరియంట్ ... 85 దేశాలకు వ్యాప్తి
, శుక్రవారం, 25 జూన్ 2021 (09:46 IST)
ఒకవైపు ప్రపంచంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతుంటే.. మరోవైపు, దాని పరివర్తనాలు మాత్రం శరవేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఇందులోభాగంగా, కరోనా వేరియంట్లలో అత్యంత ప్రమాదకారిగా మారిన డెల్టా వేరియంట్ మారింది. ఈ వైరస్ ఇప్పటికే 85 దేశాలకు వ్యాపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. 
 
వాస్తవానికి డెల్టా వేరియంట్ వెలుగు చూడడానికి ముందు అల్ఫా, బీటా, గామా వేరియంటులను ఆందోళనకర వేరియంట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కానీ, వీటి స్థానంలో ఇపుడు డెల్టా వేరియంట్ వచ్చి చేరింది. ఫలితంగా గత రెండు వారాల్లోనే 11 దేశాల్లో ఇది బయటపడిందని, ఇది ఇలాగే కొనసాగుతూ పోతే ప్రపంచానికి పెను ముప్పుగా మారుతుందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. 
 
నిజానికి గతంలో వెలుగుచూసిన అల్ఫా కంటే డెల్టా వేరియంట్ 1.23 రెట్ల వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు జపాన్ అధ్యయనంలో తేలింది. డెల్టా వైరస్ సోకిన బాధితులకు ఆక్సిజన్ అవసరం, ఐసీయూలో చేరిక, మరణాలు ఎక్కువగా ఉన్నట్టు సింగపూర్ అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌లో కరోనా వైరస్ విజృంభణకు ఇదే కారణమని చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డ్రాగన్ కంట్రీలో ఘోర అగ్నిప్రమాదం : 18మంది సజీవ దహనం